టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా అసాధారణమైన బౌలింగ్‌తో ఐదు వికెట్లు పడగొట్టి టీమిండియాను కాపాడాడు. ఈ మ్యాచ్లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా, ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం లేకపోయినా, భారత ఫీల్డర్లు ఐదు క్యాచ్‌లు వదిలినా బుమ్రా మాత్రం ఒంటరిగా పోరాడి ఇంగ్లండ్ బ్యాటర్లను కదిలించేశాడు.ఈ ప్రదర్శన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, దినేశ్ కార్తీక్‌లు బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించారు. దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) మాట్లాడుతూ,బుమ్రా టీమిండియా కొహినూర్ అని దినేశ్ కార్తీక్ కొనియాడితే, కపిల్ దేవ్ కంటే గొప్ప బౌలర్ అని ప్రశంసించాడు.ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా(5/83) ఐదు వికెట్లతో ఒంటరి పోరాటం చేశాడు. ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం లేకున్నా పిచ్ ఫ్లాట్‌గా ఉన్నా తనదైన బౌలింగ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికించాడు.
బౌలింగ్ చేసి
భారత ఫీల్డర్లు ఐదు క్యాచ్‌లు వదిలేసినా, బుమ్రా ఐదు వికెట్లతో టీమిండియాను ఆదుకున్నాడు.ఈ క్రమంలోనే బుమ్రా బౌలింగ్‌పై దినేశ్ కార్తీక్, రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవి శాస్త్రి మాట్లాడుతూ.. భారత్ క్రికెట్ చరిత్రలోనే బుమ్రా గొప్ప బౌలరని, కపిల్ కంటే మెరుగైన పేసర్ అని అభిప్రాయపడ్డాడు. ‘టీమిండియా గ్రెటేస్ట్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah). ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నేను కపిల్ దేవ్‌తో కలిసి ఆడాను. కానీ బుమ్రా భిన్నమైన బౌలర్. ప్రత్యర్థి ఎవరైనా పిచ్ ఎలా ఉన్నా ఫార్మాట్ ఏదైనా బుమ్రా సత్తా చాటుతాడు. నేను చూసిన వారిల్లో బ్యాటర్ బ్యాటింగ్ తగ్గట్లు బౌలింగ్ చేసి వికెట్ తీయడంలో మాల్కమ్ మార్షల్ అత్యుత్తమమైనవాడు.
బ్యాటర్ మనసును
బుమ్రా కూడా అతనికి ఏమాత్రం తీసిపోడు.కొత్త బంతితో బుమ్రా స్వింగ్ చేస్తే అతన్ని ఆడటం ఏ బ్యాటర్‌కైనా కష్టమే.ముఖ్యంగా అతని వినూత్నమైన యాక్షన్, లేట్ రిలీజ్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతాయి.’అని రవి శాస్త్రి (Ravi Shastri)చెప్పుకొచ్చాడు.మూడు ఫార్మాట్లలో బుమ్రా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడని దినేశ్ కార్తీక్ కొనియాడాడు. ‘బుమ్రా టీమిండియా కోహినూర్. మూడు ఫార్మాట్లలో అతను ఎంత కీలకమో జనాలకు తెలుసు. ఫార్మాట్ ఏదైనా బంతి మరేదైనా అతను సత్తా చాటుతాడు. అన్నిటి కంటే ముఖ్యంగా బుమ్రా ముందుగానే బ్యాటర్ మనసును చదివేస్తాడు. తర్వాత ఏ షాట్ ఆడబోతున్నాడో గ్రహించి అందుకు అనుగుణంగా బంతులు సంధిస్తాడు. టెస్ట్ క్రికెట్‌లో 200కు పైగా వికెట్లు తీసుకున్న బౌలర్లందరి కన్నా బుమ్రాకే మంచి యావరేజ్ ఉంది. అతను ఎంత ప్రత్యేకమో ఈ గణంకాలే చెబుతాయి.’అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
రెండో ఇన్నింగ్స్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ (innings) ప్రారంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 23.5 ఓవర్లలో 2 వికెట్లకు 90 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(47 బ్యాటింగ్)తో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(6 బ్యాటింగ్) ఉన్నాడు.
Read Also: Karun Nair: కరుణ్ నాయర్ అరుదైన ఘనత