భారత క్రికెట్ రంగంలో విషాదం నెలకొంది. సీనియర్ క్రికెటర్, భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి (77) లండన్‌లో సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దిలీప్ దోషి (Dilip Doshi) కొన్ని దశాబ్దాలుగా బ్రిటన్ రాజధాని లండన్‌లోనే నివసిస్తున్నారు. ఆయనకు భార్య కళిందీ, కుమారుడు నయన్ (మాజీ క్రికెటర్, సర్రే, సౌరాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించారు), కుమార్తె విశాఖ ఉన్నారు.దిలీప్ దోషి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. “మాజీ భారత స్పిన్నర్ దిలీప్ దోషి లండన్‌లో మరణించడం చాలా విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అని బీసీసీఐ (BCCI) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పేర్కొంది.
ప్రాతినిధ్యం
1947 డిసెంబర్ 22న అప్పటి రాజ్‌కోట్ సంస్థానంలో జన్మించిన దిలీప్ దోషి, తన అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌కు పేరుపొందారు. 30 ఏళ్ల వయసులో 1979 సెప్టెంబర్ 11న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ (International Cricket) లోకి ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, తనదైన ముద్ర వేశారు. 1979 నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టీమిండియా తరపున 33 టెస్టులు ఆడిన దిలీప్, 114 వికెట్లు తీసుకున్నాడు. అయిదేసి వికెట్లు అతను ఆరు సార్లు తీసుకున్నాడు. 15 వన్డేల్లో అతను 22 వికెట్లు తీసుకున్నాడు. సౌరాష్ట్ర, బెంగాల్, వార్‌విక్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్‌కు అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.
కెరీర్ ప్రారంభించినప్పటికీ
1980 దశకంలో అతను స్వల్ప సమయంలోనే క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఆ దశలో ఇండియన్ క్రికెట్ నడుస్తున్న తీరును ఆయన ఇష్టపడలేదు. స్పిన్ పంచ్ పేరుతో ఆటోబయోగ్రఫీ బుక్ రాశాడతను. దాంట్లో క్రికెట్ అనుభవాల గురించి చెప్పాడు.ఆలస్యంగా కెరీర్ ప్రారంభించినప్పటికీ, అంతర్జాతీయ (International) స్థాయిలో గణనీయమైన ప్రభావాన్ని చూపిన కొద్దిమంది భారత బౌలర్లలో దిలీప్ దోషి ఒకరిగా నిలిచిపోయారు. అనతికాలంలోనే భారత బౌలింగ్ దళంలో నమ్మకమైన బౌలర్‌గా ఆయన స్థిరపడ్డారు.
Read Also: Sanjeev Goenka: రాహుల్, పంత్ సెంచరీలు.. గోయెంకా స్పందన ఇదే!