📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

IPL 2025: ఆర్సీబీకి ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పు

Author Icon By Anusha
Updated: May 6, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,సన్‌రైజర్స్ హైదరాబాద్  జట్టులో సభ్యుడైన ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ నటించిన ప్రకటనపై పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆర్సీబీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఉబర్ మోటో ప్రకటన ఆర్సీబీ జట్టును అవమానించేలా ఉందని ఆ ప్రకటనను తొలగించాలని ఆర్సీబీ జట్టు పిటిషన్ దాఖలు చేయగా ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.ఐపీఎల్ 2025 సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ క్రికెటర్లు ఉన్న వివిధ వాణిజ్య ప్రకటనలను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడైన ట్రావిస్ హెడ్ ఉబెర్ మోటో ప్రకటనలో నటించాడు. ట్రావిస్ హెడ్ ఆ ప్రకటనలో ఉబర్ కోసం బైక్ టాక్సీ డ్రైవర్‌గా, డెలివరీ డ్రైవర్‌గా నటించాడు. ఈ ప్రకటనలో ఒక భాగంలో ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు బెంగళూరు స్టేడియంలో ‘రాయల్ ఛాలెంజ్ బెంగళూరు’ అనే పదాలను ట్రావిస్ హెడ్ పెయింటింగ్ చేస్తున్నట్లు చూపించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అవమానించేలా ఈ ప్రకటన ఉందని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు.

తరఫున

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రకటనదారు ఉబర్ తన ప్రకటన కోసం ఆర్సీబీ జట్టు పేరును దుర్వినియోగం చేస్తోందని, కాపీరైట్ చట్టం ప్రకారం ఇది అనుమతించబడదని వాదించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సౌరభ్ బెనర్జీ మాట్లాడుతూ “ఇది క్రికెట్‌కు సంబంధించిన ఫన్నీ ప్రకటన మాత్రమే. ఈ పరిస్థితిలో ఈ ప్రకటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌తో సహా మిగితా క్రీడలలో ఇలాంటి ఫన్నీ విషయాలు తప్పకుండా ఉంటాయి. మనం వీటిని ఆపేస్తే ఆ క్రీడపై ఆసక్తి దెబ్బతింటుంది” అని అన్నారు.ఉబర్ తరఫున న్యాయవాదులు వాదిస్తూ “ఈ ప్రకటన ఎవరినీ కించపరచడానికి ఉద్దేశించబడలేదు. ఇది కేవలం రెండు ప్రత్యర్థి జట్లను కలిగి ఉన్న హస్యభరితమైన ప్రకటన. క్రీడాస్ఫూర్తితోనే ఈ ప్రకటన చేయబడింది.”అని వాదించారు. ఈ కేసులో తుది తీర్పు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

ప్లేఆఫ్ రేసు

సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇది జరిగిన వెంటనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ పోటీ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 7 పాయింట్లు మాత్రమే కలిగి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి.

Read Also :IPL 2025: ఒత్తిడి ఎక్కువ కావడంతో కెప్టెన్సీకి దూరంగా ఉన్నా: కోహ్లీ

#DelhiHighCourt #IPL2025 #RCB #SunrisersHyderabad #TravisHead #UberMotoAd Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.