📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Deepika Padukone: తండ్రి ప్రోత్సహంతో.. బ్యాడ్మింటన్ స్కూల్‌ ప్రారంభించిన దీపికా

Author Icon By Anusha
Updated: June 10, 2025 • 1:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నటి దీపికా పదుకొనే,తన తండ్రి, దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనే 70వ పుట్టినరోజును పురస్కరించుకొని ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. త‌న తండ్రి బ‌ర్త్‌డే కానుక‌గా ‘పదుకొనే స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్’(Padukone School of Badminton)పేరుతో ఒక బ్యాడ్మింటన్ పాఠశాలను ఆమె ప్రారంభించింది. ఈ కొత్త పాఠశాల తొలి సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 18 నగరాల్లో 75 కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నగరాల్లో బెంగళూరు, NCR, ముంబై, చెన్నై, జైపూర్, పుణె, నాసిక్, మైసూరు, పానిపట్, డెహ్రాడూన్, ఉదయ్‌పూర్, కోయంబత్తూర్, సాంగ్లీ, సూరత్ వంటివి ఉన్నాయి.

ప్రత్యక్షంగా అనుభవించాను

ఈ సందర్భంగా దీపికా(Deepika Padukone) తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక ఎమోష‌న‌ల్ పోస్ట్‌ని పంచుకుంది. ఒక‌ బ్యాడ్మింటన్ ఆడుతూ పెరిగిన వ్యక్తిగా, ఈ క్రీడ ఒకరి జీవితాన్ని శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా ఎంతగా తీర్చిదిద్దుతుందో నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ‘పదుకొనే స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్’ (PSB) ద్వారా, మేము అన్ని వర్గాల ప్రజలకు బ్యాడ్మింటన్ ఆనందాన్ని, క్రమశిక్షణను అందించాలని ఆశిస్తున్నాము. అలాగే, ఆరోగ్యకరమైన, మరింత దృష్టి కేంద్రీకరించిన, క్రీడల ద్వారా స్ఫూర్తి పొందిన తరాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాము.

బ్యాడ్మింటన్ స్కూల్‌

బ్యాడ్మింటన్ అందరికి అందుబాటులో ఉండాల‌నే మీ క‌ళ‌ను నిజం చేయ‌డానికి మేము కట్టుబడి ఉన్నాం. 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు పప్పా”. అంటూ దీపికా తన తండ్రిపై ప్రేమను చాటుకున్నారు.మరోవైపు బ్యాడ్మింటన్ స్కూల్‌కి ప్రకాష్ పదుకొనే(Prakash Padukone)స్వయంగా మార్గదర్శకత్వం వహించ‌నున్నారు. బ్యాడ్మింటన్ పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయని, క్రమశిక్షణ, ఓర్పు, గెలుపు స్వభావాన్ని అలవర్చుతాయని ప్రకాష్ పదుకొనే తెలిపారు. PSB ద్వారా, నాణ్యమైన కోచింగ్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, క్షేత్రస్థాయి నుండి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం తమ లక్ష్యమని ఆయన వివరించారు.

Read Also: Nicholas Pooran : అంతర్జాతీయ క్రికెట్‌కు నికోలస్‌ పూరన్‌ రిటైర్మెంట్

#BadmintonForAll #DeepikaPadukone #PadukoneSchoolOfBadminton #PrakashPadukone Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.