📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

CV Anand: ఆర్‌సీబీ విజయం.. హైదరాబాద్‌ సెలెబ్రేషన్స్‌పై సీవీ ఆనంద్ ఫైర్

Author Icon By Anusha
Updated: June 6, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) విజయం సాధించిన తర్వాత అర్థరాత్రి హైదరాబాద్‌లో జరిగిన సెలెబ్రేషన్స్‌పై నగర కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌సీబీ విజయంతో హైదరాబాద్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో(Chinnaswamy Stadium)ని తొక్కిసలాట ఘటన గురించి ప్రస్తావిస్తూ, హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటే బాధ్యులు ఎవరు? అని అసహనం వ్యక్తం చేశారు.సమాజం ఎటు వెళ్తుందని ఫ్యాన్స్ ఓవరాక్షన్‌పై మండిపడ్డారు.

ఈ మేరకు ఆయన ఎక్స్‌వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. హైదరాబాద్ రోడ్లపై ఆర్‌సీబీ ఫ్యాన్స్ చేసిన ఓవరాక్షన్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు.’బెంగళూరులో జరిగిన తొక్కిసలాట గురించి చూసినప్పుడు దాని గురించి విన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామా? అని ఆశ్చర్యం కలిగింది. ఇది ప్రపంచ కప్ గెలిచిన జాతీయ జట్టు కాదు. ఇది కేవలం వాణిజ్యపరంగా పనిచేసే ఆర్‌‌సీబీ(RCB) అనే ఫ్రాంచైజీ సాధించిన విజయం. ఆ జట్టులో ఒక్క హైదరాబాద్ ఆటగాడు కూడా లేడు. ఇది హైదరాబాద్ బేస్డ్ ఫ్రాంచైజీ కూడా కాదు. అయినా ఆ జట్టు విజయం తర్వాత అర్థరాత్రి 12 గంటలకు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌లపైకి భారీ సంఖ్యలో యువకులు రావడం, ఆనందోత్సాహలతో సంబరాలు చేసుకోవడం చూసి రాత్రిపూట విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఈ ట్వీట్ కింద చూడవచ్చు.

బలగాలను మోహరించాల్సి

ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అభిమానుల అత్యుత్సాహం వల్ల ఆ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. అభిమానుల ఓవరాక్షన్, గూండాయిజంను చూసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది. అల్లరి మూకను చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఓ పోలీస్ అధికారిగా చెబుతున్నా పెద్ద సంఖ్యలో గుమిగూడి రోడ్లపై వేడుకలు చేసుకోవం జనాల భద్రతకు పెద్ద ప్రమాదం. బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు దారితీయవచ్చు.

సెలెబ్రేట్ చేసుకుంటారని

హైదరాబాద్‌లో కూడా ఎవరైన చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? అసలు ఆర్‌సీబీ విజయాన్ని హైదరాబాద్‌లో సెలెబ్రేట్ చేసుకుంటారని ఊహించగలమా? ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా(Social Media) ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో పోలీస్ అధికారులు ప్రతీ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఓ మానవుడికి ఇలా చేయడం సాధ్యమేనా-అని నేను ఆలోచిస్తున్నాను’అని సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.

టైటిల్ గెలవడంతో

ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలని సీవీ ఆనంద్ తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ నగరంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్‌సీబీ అభిమానులు(RCB Fans) సంబరాలు జరుపుకున్నారు. 18 ఏళ్ల తర్వాత ఆర్‌సీబీ టైటిల్ అందుకోవడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఈ టైటిల్ గెలవడంతో అతనిపై ఉన్న అభిమానంతో ఆర్‌సీబీ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే కొందరు అత్యుత్సాహంతో హద్దులు ధాటి ప్రవర్తించారు.

Read Also: Shubman Gill: రోహిత్ శర్మనే నాకు ఆదర్శమన్న శుభ్‌మన్ గిల్

#CVAnandStatement #HyderabadFans #RCBFansOverreaction #RCBVictoryCelebrations Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.