📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం

బంగ్లా యంగ్ బౌలర్‌తో భారత్‌కు ఇబ్బందే

Author Icon By Anusha
Updated: February 20, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో రెండో మ్యాచ్ గురువారం (ఫిబ్రవరి 20) టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనుంది. టోర్నమెంట్‌లో భారత్‌కు నిజమైన సవాలు విసురుతుందనే అనిపిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్ ఓటమిపాలైనప్పటికీ, వారి బౌలింగ్ విభాగం మాత్రం తక్కువ కాదు.ముఖ్యంగా, 22 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ నహిద్ రాణా, టీమిండియాకు పెను ముప్పుగా మారే అవకాశం ఉంది. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా జరిగే ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో రాణా ప్రదర్శనపై అందరి చూపు ఉండనుంది. వారు ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఓడిపోయారు. కానీ బంగ్లాదేశ్ జట్టులో 22 ఏళ్ల కుర్రాడు భారత్ కు పెను ముప్పుగా మారే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా టీమ్ ఇండియా బ్యాటర్లు ఈ బౌలర్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. జట్టులో మేటి స్పిన్నర్లతో పాటు ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా తన ఫాస్ట్ బౌలింగ్‌పై బాగా నమ్మకం పెట్టుకున్నాడు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో. దీనికి ప్రధాన కారణం 22 ఏళ్ల యువ బౌలర్ నహిద్ రాణా. 150 కంటే కి.మీ. కంటే ఎక్కువ వేగంతో స్థిరంగా బౌలింగ్ చేయడంలో నహీద్ నిష్ణాతుడు. దుబాయ్‌లో టీమ్ఇండియాకు అతను అతిపెద్ద ముప్పు కావచ్చు. భారతదేశం కంటే బంగ్లాదేశ్ జట్టు బలహీనంగా కనిపించవచ్చు. కానీ నహిద్ రాణా రూపంలో భారత్ కు పెను ముప్పు పొంచి ఉంది. 6 అడుగుల 5 అంగుళాల పొడవున్న నహిద్ రాణా గత సంవత్సరం అరంగేట్రం చేశాడు. తన ఫాస్ట్ బౌలింగ్ తో అతి తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపు పొందాడు. బంగ్లాదేశ్ తరపున అత్యంత వేగవంతమైన బంతిని వేసిన రికార్డు అతని సొంతం. అతను 152 వేగంతో బంతిని బౌలింగ్ చేశాడు. గత సంవత్సరం పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో, రాణా తన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను ఆశ్చర్యపరిచాడు.

నహిద్ రాణా

అతని వేగం, బౌన్స్ సామర్థ్యం కారణంగా తక్కువ కాలంలోనే విశేష గుర్తింపు పొందాడు. బంగ్లాదేశ్ తరపున అత్యంత వేగవంతమైన బంతిని (152 కి.మీ.) విసిరిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. నహిద్ రాణా బాలింగ్ స్పెల్స్ ప్రత్యర్థి జట్లను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా దుబాయ్ పిచ్ వేగం, బౌన్స్‌కు అనుకూలంగా ఉండటం, రాణా బౌలింగ్‌ను మరింత ప్రమాదకరంగా మారుస్తుంది.దుబాయ్ పిచ్‌పై నహీద్ ఎత్తు, వేగం కూడా అనుకూలంగా ఉండవచ్చు. కాబట్టి అతను బంతికి మంచి బౌన్స్ లభించగలదు. దుబాయ్‌లో, ఇది మరింత ప్రమాదకరమైనది కావచ్చు. గత సంవత్సరం భారత పర్యటనలో టెస్ట్ సిరీస్‌లో నహీద్ పెద్దగా విజయం సాధించలేకపోయాడు. చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అతను 82 పరుగులకు ఒక వికెట్ తీసుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్‌లో అతను 21 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు.కానీ అతను భారత బ్యాటర్లను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి అనుమతించలేదు. ఇప్పుడు దుబాయ్‌లో ఉన్న అతను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా ఇతర బ్యాటర్లకు ముప్పుగా మారే అవకాశముంది. బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో కూడా భారత జట్టుపై విజయానికి రానా బౌలింగ్ కీలకమని చెప్పాడు.

#BangladeshCricket #ChampionsTrophy2025 #CricketNews #DubaiPitch #FastBowler #INDvsBAN #rohitsharma #TeamIndia #ViratKohli Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.