हिन्दी | Epaper
టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

BCB: ఆటగాళ్లకు షాక్ ఇచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు

Anusha
BCB: ఆటగాళ్లకు షాక్ ఇచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) (BCB) తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ఆ దేశ క్రికెట్‌ను తీవ్ర గందరగోళంలోకి నెట్టేశాయి. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ అధికారికంగా తప్పించిన వేళ, కొన్ని గంటల్లోనే బీసీబీ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది. ఆటగాళ్ల నిరసనకు ప్రధాన కారణమైన ఫైనాన్స్ కమిటీ చీఫ్ ఎం. నాజ్ముల్ ఇస్లాంను మళ్లీ అదే పదవిలో కొనసాగించడమే ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఇటీవల బీసీబీ డైరెక్టర్ అయిన నాజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలతో ఈ సంక్షోభం మొదలైంది.

Read Also: Abhishek Sharma: ఆయన రికార్డు బద్దలుగొట్టడం అసాధ్యం: అభిషేక్

బీపీఎల్‌ను బహిష్కరించిన ఆటగాళ్లు

మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను భారత ఏజెంట్ అని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ప్రపంచకప్ నుంచి వైదొలిగితే ఆటగాళ్లకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని, సరిగా ఆడనప్పుడు వారి నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆటగాళ్లు.. మహ్మద్ మిథున్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్ నాయకత్వంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్‌)ను బహిష్కరించారు. ఇటీవల బీసీబీ డైరెక్టర్ అయిన నాజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలతో ఈ సంక్షోభం మొదలైంది.

Bangladesh Cricket Board gives shock to players
Bangladesh Cricket Board gives shock to players

ఆటగాళ్ల నిరసనతో బీపీఎల్‌ ప్రసార ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీబీ వెనక్కి తగ్గింది. నాజ్ముల్‌ను ఫైనాన్స్ కమిటీ పదవి నుంచి తొలగించి, షోకాజ్ నోటీసు జారీ చేసింది. బోర్డు తమకు న్యాయం చేసిందని భావించిన ఆటగాళ్లు ఆందోళన విరమించి, మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. భద్రతా కారణాలు చూపుతూ టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. అయితే, ఐసీసీ మాత్రం బంగ్లా ఆట‌గాళ్ల‌కు భ‌ద్ర‌త ప‌రంగా ఎలాంటి స‌మ‌స్య లేద‌ని తేల్చింది. దీంతో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870