📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

ఐసీసీ వన్డేల్లో ఆస్ట్రేలియా హవా

Author Icon By Anusha
Updated: February 23, 2025 • 2:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయకూడదని మరోసారి నిరూపితమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అడుగుపెట్టే ముందు ఈ జట్టు గ్రూప్ స్టేజ్‌లో అయినా పోటీ ఇవ్వగలదా? అనుకున్నారు. కానీ ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్‌లో అతిపెద్ద ఛేజింగ్ విక్టరీతో ఆసీస్‌ అంటే ఏంటో ప్రపంచానికి చూపించింది. స్టార్ బౌలర్లు స్టార్క్, కమిన్స్, హేజెల్‌వుడ్ లేకున్నా ఆస్ట్రేలియా రికార్డుల వేట కొనసాగించింది. లాహోర్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బి తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయదుందుభి మోగించింది. టాస్ గెలిచిన స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే లాహోర్ పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాటర్లు బౌండరీలతో చెలరేగిపోయారు. ఓపెనర్ బెన్ డకెట్ 143 బంతుల్లో 17 ఫోర్లు, మూడు సిక్సర్లతో 165 పరుగులు చేశాడు. దాంతో ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది.

టాప్-5 భారీ ఛేజింగ్స్

వన్డే వరల్డ్‌కప్ 2019లో వెస్టిండీస్‌పై బంగ్లాదేశ్ జట్టు 322 టార్గెట్‌ను చేజ్ చేసింది. 2017లో ఒవెల్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అందించిన 322 టార్గెట్‌ను శ్రీలంక జట్టు మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డే వరల్డ్‌కప్ 2011లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ జట్టు 328 టార్గెట్‌ను ఛేజ్ చేసి రికార్డు సృష్టించింది. హైదరాబాద్ వేదికగా 2023 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై పాకిస్తాన్ 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తాజాగా లాహోర్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ ఇచ్చిన 352 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

తొలుత ఇంగ్లండ్ హవా

టాస్ గెలిచిన స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే లాహోర్ పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాటర్లు ఆడారు. బెన్ డకెట్ (165) మెరుపు సెంచరీతో చెలరేగగా, జోస్ బట్లర్ (72), జో రూట్ (54) రాణించడంతో 50 ఓవర్లలో 351/8 పరుగులు చేశారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆరంభంలోనే ఒడిదుడుకులకు లోనైంది. ట్రావిస్ హెడ్ (6), స్టీవ్ స్మిత్ (5) వెంటవెంటనే అవుట్ కావడంతో ఆసీస్ తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతుందనుకున్నారు. మాథ్యూ షార్ట్, మార్నస్ లబుషేన్ కలిసి మూడో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. షార్ట్ 63 పరుగులు, లబుషేన్ 47 పరుగులు చేసి అవుటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోష్ ఇన్‌గ్లిస్ 86 బంతుల్లోనే 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 120 పరుగులు చేసి జట్టును సునాయాసంగా గెలిపించాడు. అలెక్స్ క్యారీ 69, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 32 పరుగులతో రాణించడంతో 47.3 ఓవర్లలోనే 356 పరుగులు చేసి ఘన విజయం సాధించారు.

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ అందించిన 351 పరుగుల భారీ లక్ష్యాన్ని 47.3 ఓవర్లలోనే ఛేదించి ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లలోనే భారీ ఛేజింగ్ చేసిన జట్టుగా నిలిచింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్ జట్టు శ్రీలంకపై ఛేజింగ్‌లో 345 పరుగులు చేసింది. ఇప్పటి వరకు అదే హైయెస్ట్ టార్గెట్ ఛేజింగ్ కాగా ఆ రికార్డును ఆస్ట్రేలియా బద్దలు కొట్టింది.

#AUSCricket #AUSvsENG #ChampionsTrophy2025 #CricketRecords Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.