हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

 Telugu News: Asia Cup 2025: ట్రోఫీని హోటల్‌ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ.. చీఫ్ ఎందుకంటే?

Sushmitha
 Telugu News: Asia Cup 2025: ట్రోఫీని హోటల్‌ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ.. చీఫ్ ఎందుకంటే?

ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో(Tournament) టీమిండియా పాకిస్థాన్‌ను వరుసగా మూడు సార్లు ఓడించింది (లీగ్ దశ, సూపర్-4, ఫైనల్). అయితే, ఈ విజయం తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీసుకున్న ఒక చర్య ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీకి పెద్ద తలనొప్పిగా మారింది.

Read Also: Telangana: హైసెక్యూరిటీ ప్లేట్లపై ఎలాంటి గడువు లేదు

Asia Cup 2025

ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన టీమిండియా

టీమిండియా మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ పరిణామంతో ఆగ్రహించిన మొహ్సిన్ నఖ్వీ, ఆసియా కప్ ట్రోఫీని(Asia Cup trophy) తనతో పాటు హోటల్‌కు తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఫైనల్ మ్యాచ్‌కు ముందే, నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకూడదని భారత ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసినా కూడా మొహ్సిన్ నఖ్వీ అవార్డుల వేడుక కోసం దుబాయ్ వచ్చారు.

నఖ్వీ చర్యపై బీసీసీఐ ఆగ్రహం

ఆసియా కప్ నిర్వహణ బాధ్యత పూర్తిగా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ది, పీసీబీది కాదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆసియా కప్ ట్రోఫీ పాకిస్థాన్ బోర్డుకు చెందిన జాగీరు కాదని, ఛాంపియన్ హోదాలో ట్రోఫీ భారత జట్టుకే దక్కుతుందని పేర్కొంది. మొహ్సిన్ నఖ్వీ చేసిన ఈ చర్యను భారత క్రికెట్ బోర్డు క్షమించదగినదిగా భావించడం లేదు. ఈ ట్రోఫీని హోటల్‌కు తీసుకెళ్లినందుకు గానూ బీసీసీఐ త్వరలోనే ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది. ఇటువంటి పక్షపాతపూరిత వైఖరి తర్వాత మొహ్సిన్ నఖ్వీకి భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో కొనసాగే విషయంలో సమస్యలు తలెత్తవచ్చు లేదా నిషేధం విధించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ఎందుకు నిరాకరించింది?

పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోకూడదని భారత జట్టు ముందుగానే నిర్ణయించుకుంది.

మొహ్సిన్ నఖ్వీ చేసిన తప్పిదం ఏమిటి?

భారత జట్టు ట్రోఫీ తీసుకోకపోవడంతో ఆయన ఆగ్రహించి, ఆసియా కప్ ట్రోఫీని తనతో పాటు హోటల్‌కు తీసుకువెళ్లారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870