📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Sam Billings: ఏ టోర్నమెంట్ అయినా ఐపీఎల్ తర్వాతే :సామ్ బిల్లింగ్స్

Author Icon By Anusha
Updated: April 16, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) 2025లో లాహోర్ ఖలందర్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్‌గా మారింది. అయితే పాకిస్థాన్ ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను తరచుగా ఐపీఎల్‌తో పోల్చుతున్నారు.ఇటీవల విలేకరుల సమావేశంలో ఐపీఎల్ వర్సెస్ పీఎస్ఎల్ గురించి అడిగినప్పుడు ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పి పాక్ మీడియా నోరు మూయించాడు. ఎవరు ఏమి చెప్పినా తాను తన వైఖరికే కట్టుబడి ఉంటానని ప్రపంచంలోని ఏ ఇతర టీ20 లీగ్ కూడా ఐపీఎల్ కు సమానంగా ఉండదన్నాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నమెంట్ గా ఐపీఎల్ ను విస్మరించడం కష్టమని చెప్పాడు. ఇది చాలా స్పష్టంగా ఉందని అనవసరంగా ఈ ప్రశ్న అడగడంలో అర్థం లేదన్నాడు. ప్రపంచంలో ఏ టోర్నమెంట్ అయినా ఐపీఎల్ తర్వాతేనని సామ్ బిల్లింగ్స్ స్పష్టం చేశాడు. పీఎస్ఎల్ ను ఐపీఎల్ తో పోల్చలేమని చెప్పాడు.

మొదటి సారి

చాలా మంది క్రికెటర్లు పాకిస్తాన్ మీడియా ముందే ఐపీఎల్ మెరుగ్గా ఉందని ప్రకటించారు.కానీ పాకిస్తాన్ జర్నలిస్టులు భారత్ ను చర్చలోకి లాగడం ద్వారా ఐపీఎల్ ను తక్కువ చేసి వార్తలను సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పదేపదే విఫలమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్ ఓ ప్రశ్న అడిగారు. ఐపీఎల్ లో అమ్ముడుపోకుండా పీఎస్ఎల్ లో ఆడినందుకు భారత ఫ్యాన్స్ నుంచి ఎంత ద్వేషం వచ్చిందని అడిగాడు. దానికి సమాధానమిస్తూ నేను దీని గురించి వినడం ఇదే మొదటి సారి అంటూ సమాధానమిచ్చాడు.

ఇన్నింగ్స్

మంగళవారం పీఎస్ఎల్ 2025లో భాగంగా లాహోర్ ఖలందర్స్. కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో లాహోర్ ఖలందర్స్ 65 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లాహోర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లాహోర్ ఖలందర్స్ తరపున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫఖర్ జమాన్ 76 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా, డారిల్ మిచెల్ 75 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సామ్ బిల్లింగ్స్ 19 పరుగులు చేశాడు. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కరాచీ కింగ్స్ 19.1 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. కరాచీ కింగ్స్ తరపున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఖుష్దిల్ షా 39 పరుగులతో భారీ స్కోరర్ గా నిలిచాడు. లాహోర్ ఖలందర్స్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, రియాద్ హుస్సేన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.

Read Also: IPL 2025: బ్యాట్ టెస్టులో దొరికిన సునిల్ న‌రైన్‌ ,అన్రిచ్ నోర్జా

#CricketControversy #IPL2025 #IPLvsPSL #PSL2025 #SamBillings #T20Leagues Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.