📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Abhishek Sharma: యువీ ముందే చెప్పాడు గెలుస్తామని: అభిషేక్

Author Icon By Anusha
Updated: October 3, 2025 • 10:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో టీమిండియా తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, Player of the Tournament అవార్డు దక్కించుకున్న యువ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన విజయానికి వెనుక ఉన్న అసలు కథను పంచుకున్నాడు. చిన్న వయస్సులోనే తన ప్రతిభను చాటుకున్న అభిషేక్, ఈ టోర్నమెంట్‌లో తన దూకుడు ఆటతీరుతో అభిమానులను, విమర్శకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కీలక సందర్భాల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ టీమిండియా విజయానికి మలుపుతిప్పేలా మారాయి.

Lionel Messi: భారత్‌పై ప్రత్యేక అభిమానం ఉంది: మెస్సీ

తన ప్రదర్శనపై స్పందించిన అభిషేక్ శర్మ, ఈ విజయానికి ప్రధాన కారణం భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ Yuvraj Singh ఇచ్చిన మార్గనిర్దేశమేనని స్పష్టం చేశాడు. రెండేళ్ల క్రితం యువరాజ్ తనకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని,

ఆ సూచనలు తన ఆటను మరింత మెరుగుపరచడానికి తోడ్పడ్డాయని అన్నాడు. “నువ్వు కష్టపడి శ్రమిస్తే, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద విజయాలు సాధిస్తావు” అని యువరాజ్ అప్పట్లో చెప్పారని, ఆ జోస్యం ఇప్పుడు నిజమైందని అభిషేక్ గుర్తుచేసుకున్నాడు.

ఐపీఎల్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి కూడా తాను ఇబ్బంది పడ్డా

ఒకానొక దశలో ఐపీఎల్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి కూడా తాను ఇబ్బంది పడ్డానని అభిషేక్ తెలిపాడు. “నా వయసు వాడైన శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) అప్పటికే భారత్ తరఫున ఆడుతున్నాడు. నేను మాత్రం వెనుకబడిపోయాననే భావనలో ఉండేవాడిని. సరిగ్గా ఆ సమయంలోనే లాక్‌డౌన్‌లో యువరాజ్ పాజీ దగ్గర శిక్షణ తీసుకున్నాను” అని అభిషేక్ చెప్పాడు.

Abhishek Sharma

తనతో పాటు శుభ్‌మన్, ప్రభ్‌సిమ్రన్, అన్మోల్‌ప్రీత్ కూడా ఆ క్యాంపులో పాల్గొన్నారని పేర్కొన్నాడు.ఆ శిక్షణ సమయంలో యువరాజ్ తనతో అన్న మాటలను అభిషేక్ గుర్తుచేసుకున్నాడు. “ఒకరోజు యువీ పాజీ నాతో మాట్లాడుతూ.. ‘నిన్ను నేను రాష్ట్రం కోసమో, ఐపీఎల్ కోసమో,

ఒకరోజు యువీ పాజీ నాతో మాట్లాడుతూ

లేక టీమిండియా (Team India) లో చోటు సంపాదించడం కోసమో సిద్ధం చేయడం లేదు. భారత్‌కు మ్యాచ్‌లు గెలిపించే ఆటగాడిగా తీర్చిదిద్దుతున్నా. ఈ మాట రాసి పెట్టుకో.. మరో రెండేళ్లలో ఇది జరిగి తీరుతుంది’ అని ఎంతో నమ్మకంగా చెప్పారు. ఆ మాటలే నా లక్ష్యాన్ని మార్చేశాయి” అని అభిషేక్ వివరించాడు.తన ఆటను మెరుగుపరచడానికి యువరాజ్ (Yuvraj) ఎంతో శ్రమించారని అభిషేక్ తెలిపాడు. “మా బ్యాటింగ్ వీడియోలను గంటల తరబడి చూసి, అందులోని లోపాలను నోట్స్‌లో రాసుకునేవారు.

పాత, కొత్త వీడియోల స్క్రీన్‌షాట్లు తీసి తేడాలను విశ్లేషించి చెప్పేవారు. ప్రాక్టీస్ సమయంలో ఐదు గంటలకు పైగా మాతో పాటే ఉండేవారు. యువీ పాజీ ఇంత లోతుగా విశ్లేషిస్తారని చాలా మందికి తెలియదు” అని అభిషేక్ పేర్కొన్నాడు. కష్టకాలంలో యువరాజ్ ఇచ్చిన భరోసా, శిక్షణ వల్లే తాను ఈరోజు మ్యాచ్ విన్నర్‌గా నిలబడగలిగానని ఆయన స్పష్టం చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

abhishek sharma Abhishek Sharma performance Asia Cup 2025 Breaking News Cricket News Indian Cricket latest news player of the tournament Team India Telugu News Yuvraj Singh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.