हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Special Ops 2: ‘స్పెషల్ ఓపీఎస్ 2’ (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

Ramya
Special Ops 2: ‘స్పెషల్ ఓపీఎస్ 2’ (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన భారీ వెబ్ సిరీస్‌లలో ‘స్పెషల్ ఓపీఎస్’ ఒకటి. కేకే మేనన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ సిరీస్‌కు అనుబంధంగా వచ్చిన ‘స్పెషల్ ఓపీఎస్ 1.5’ కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. తాజాగా ‘స్పెషల్ ఓపీఎస్ 2’ (Special Ops 2) అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 18వ తేదీ నుంచి 7 ఎపిసోడ్‌లుగా ‘జియో హాట్‌స్టార్’లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

Special Ops 2: 'స్పెషల్ ఓపీఎస్ 2' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
Special Ops 2: ‘స్పెషల్ ఓపీఎస్ 2’ (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

కథాంశం

‘బుడాపెస్ట్’లో (Budapest) జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో పాల్గొనేందుకు ఇండియా నుంచి డాక్టర్ పీయూష్ భార్గవ్ (ఆరిఫ్ జకారియా) హాజరవుతాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని ఎలా శాసిస్తుందనే అంశంపై ఆయన ఆ సదస్సులో ప్రసంగించి వస్తుండగా, కొందరు దుండగులు ఆయనను కిడ్నాప్ చేస్తారు. తనను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అనే విషయాలు పీయూష్ భార్గవ్‌కు అర్థం కావు. మరోవైపు, బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్న జిగ్నేష్ లోలాకియా విదేశాలకు పారిపోతాడు. భవిష్యత్తులో తమ అవసరాల కోసం ఆ బ్యాంకులలో డబ్బు దాచుకున్న సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతుంటాయి. వారిలో సుబ్రహ్మణ్యం (ప్రకాష్ రాజ్) కూడా ఒకరు. జిగ్నేష్‌ను వెనక్కి తీసుకురావాలని అతను పట్టుబడతాడు.

ఈ రెండు సమస్యలను పరిష్కరించే బాధ్యతను ‘రా’ ఉన్నతాధికారులు (‘RAW’ top brass) హిమ్మత్ సింగ్‌కు అప్పగిస్తారు. కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, హిమ్మత్ సింగ్ తన టీమ్‌తో కలిసి రంగంలోకి దిగుతాడు. శత్రువుల బారి నుంచి పీయూష్ భార్గవ్‌ను కాపాడి తీసుకురావడం, బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి దేశం విడిచిపోయిన జిగ్మేష్‌ను బంధించి తీసుకురావడం ఆయన ముందున్న సవాళ్లు. వాటిని ఆయన టీమ్ ఎలా ఎదుర్కొందనేది మిగతా కథ.

విశ్లేషణ

ఆధునిక ప్రపంచాన్ని ఇప్పుడు AI ఆవరించింది. అన్ని వైపులా అది చాలా వేగంగా విస్తరిస్తోంది. AI కారణంగా కొన్ని ప్రయోజనాలు పొందడమే కాదు, మరికొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకుని నీరజ్ పాండే – దీపక్ కింగ్ర్రాణి ఈ కథను తయారు చేసుకున్నారు. ప్రధానమైన ఈ అంశాన్ని హైలైట్ చేస్తూనే, కథాంశం ఏమిటనేది స్పష్టంగా చూపించారు. దేశ భద్రత.. ‘రా’ ఆపరేషన్స్‌కు సంబంధించిన చాలా సిరీస్‌లు ఇంతకుముందు వచ్చాయి. అదే తరహాలో ఈ సిరీస్‌లోని ఈ సీజన్ కూడా కొనసాగుతుంది. కథ పరిధి విస్తృతంగా ఉండటం.. ఖర్చుకు వెనకాడకపోవడం మనకు తెరపై కనిపిస్తుంది. ఈ తరహా సిరీస్‌లకు యాక్షన్ సన్నివేశాలు ప్రధానమని చెప్పాలి. ఆ వైపు నుంచి ఆశించిన స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఎమోషన్స్ వైపు నుంచి కూడా బ్యాలెన్స్ చేయాలనుకున్నారు. కానీ ఆ వైపు నుంచి సరైన ట్రాక్ వేసుకోలేకపోయారు.

ఒక సమస్యపై కాకుండా రెండు సమస్యల దిశగా ‘రా’ టీమ్ కదలడం, రెండు పడవలపై ప్రయాణం మాదిరిగా అనిపిస్తుంది. ప్రధానమైన కథాంశం ఆసక్తికరంగా ముందుకు సాగుతుండగా, బ్యాంకులకు జిగ్నేష్ అనే వ్యాపారవేత్త టోపీపెట్టి పారిపోవడమనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇది ప్రధానమైన అంశానికి అంతరాయాన్ని కలిగించినట్టుగా అనిపిస్తుంది. అలాగే చాలా పాత్రలు తెరపైకి వస్తుంటాయి గానీ, వాటికి సరైన ప్రాధాన్యత లేకపోవడం కనిపిస్తుంది.

నటీనటుల పనితీరు

దర్శకుడు ప్రధానమైన అంశానికి సంబంధించిన కథను బలంగానే రాసుకున్నారు. అయితే హీరో.. విలన్ పాత్రలు మినహా, మిగతా పాత్రలేవీ ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోయాయి. చివరికి ప్రకాష్ రాజ్ పాత్ర కూడా బలహీనంగానే అనిపిస్తుంది. అయితే ఆయా దేశాలలోని లొకేషన్స్, ఈ కథకు కొత్త ఆకర్షణను.. భారీతనాన్ని తీసుకొచ్చాయని చెప్పాలి. కేకే మేనన్.. తాహిర్ రాజ్ భాసిన్ నటన ఆకట్టుకుంటాయి. అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లో కరణ్ థాకర్.. సయామీ ఖేర్ మెప్పిస్తారు. అరవింద్ సింగ్ ఫోటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. అద్వైత్ నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ప్రవీణ్ ఎడిటింగ్ ఓకే.

ముగింపు

‘స్పెషల్ ఓపీఎస్ 2’ (Special Ops 2) నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రధానమైన కథాంశం బాగానే ఉంది. అయితే జిగ్మేష్ సూత్రధారిగా నడిచే బ్యాంకు వ్యవహారం.. ఎమోషనల్ సైడ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో సెట్ చేసిన హీరో ఫ్యామిలీ ఇష్యూ.. ఈ రెండూ కూడా ప్రధానమైన కథ వేగానికి ఆటంకాన్ని కలిగించినట్టుగా అనిపిస్తుంది. అభ్యంతరకర సంభాషణలు.. సన్నివేశాలు లేని కారణంగా, కుటుంబంతో కలిసి ఈ సిరీస్‌ను చూడవచ్చు.

స్పెషల్ ఆప్స్ 2 వస్తుందా?

స్పెషల్ ఆప్స్ సీజన్ 2 జూలై 18న OTTలో విడుదల కానుంది . వేచి ఉండటం దాదాపు ముగిసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గూఢచర్య థ్రిల్లర్ అయిన స్పెషల్ ఆప్స్ 2, JioHotsarలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది మరియు జూలై 18న దాని అన్ని పేలుడు ఎపిసోడ్‌లను విడుదల చేసింది – మొదట ప్రకటించిన దానికంటే ఒక వారం ఆలస్యంగా.

స్పెషల్ ఆప్స్ నిజమైన కథనా?

ఈ సిరీస్‌ను ఎనిమిది గంటల కథగా అభివృద్ధి చేశారు, ఇది పాండే, దీపక్ కింగ్రానీ మరియు బెనజీర్ అలీ ఫిదాలతో కలిసి పందొమ్మిది సంవత్సరాల జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనల నుండి ప్రేరణ పొందింది.

స్పెషల్ ఆప్స్ సీజన్ 3 వస్తుందా?

నిర్మాతలు దీనిని ధృవీకరించినప్పటికీ, ఏమీ మూసివేయబడలేదు. పరిస్థితులు షెడ్యూల్‌కు కట్టుబడి ఉంటే, 2026 చివరి నాటికి సీజన్ మూడు వచ్చే అవకాశం ఉంది . అది న్యాయమైన వేచి ఉండటమే, కానీ నెమ్మదిగా తన ప్రపంచాన్ని విస్తరిస్తూ, ప్రతి సీజన్‌తో కొత్త భూభాగంలోకి నెట్టబడుతున్న సిరీస్ కోసం అది అసాధారణం కాదు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Pawan Kalyan: నేనెప్పుడూ డబ్బు, రికార్డుల కోసం సినిమాలు చేయలేదు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870