Spadex experiments to resume from March 15.. ISRO

మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు పునఃప్రారంభం : ఇస్రో

ఇప్పటికే రెండు ఉపగ్రహాలను విజయవంతం

న్యూఢిల్లీ: జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇస్రో చీఫ్‌ వి. నారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా నింగిలోనే ఉపగ్రహాలను అనుసంధానించే ప్రత్యేక మిషన్‌ను అమలు చేస్తోంది. ఇప్పటికే రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించిన ఇస్రో, ఈ ప్రయోగాలను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు చేపట్టనున్నట్లు నారాయణన్ వెల్లడించారు.

Advertisements
మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు

ప్రయోగాల ప్రణాళిక

ప్రస్తుతం ఉపగ్రహం దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంది. వివిధ ప్రయోగాలను నిర్వహించేందుకు వచ్చే రెండు నెలల్లో 10 నుంచి 15 రోజుల అనుకూల సమయం ఉంటుంది.ప్రస్తుతం ఉపగ్రహాలను విడదీసి, రీ-డాకింగ్‌ చేసే అనుకరణ ప్రయోగాలు చేపట్టుతున్నాం. ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం” అని ఇస్రో ఛైర్మన్‌ వి. నారాయణన్ తెలిపారు. ఇస్రో చీఫ్‌ ప్రకారం,ఉపగ్రహాల్లో తగినంత ఇంధనం ఉంది కాబట్టి మరిన్ని ప్రయోగాలను చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే,రెండు నెలల తర్వాత మరో అనుకూల సమయంలో మూడో దశ ప్రయోగాలను కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

భారత్ ఘనత

డాకింగ్‌, దృఢత్వ ప్రయోగాల అనంతరం రెండు ఉపగ్రహాల మధ్య విద్యుత్‌ శక్తి బదిలీకి సంబంధించిన ప్రయోగాలు నిర్వహించాలని ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో కీలక ముందడుగు వేస్తూ ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానించే మిషన్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా,2023 డిసెంబర్ 30న ఛేజర్‌,టార్గెట్‌ అనే జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పలు ప్రయత్నాల అనంతరం,జనవరి 16న డాకింగ్‌ ప్రక్రియ స్పేడెక్స్‌ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.

Related Posts
చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు ట్రస్ట్ గొప్ప శుభవార్త
చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు ట్రస్ట్ గొప్ప శుభవార్త

చార్‌ధామ్ యాత్ర మార్గంలో అన్ని పనులు ఏప్రిల్ 15 నాటికి పూర్తవాలని ప్రజా పనుల శాఖ మంత్రి పాండే ఆదేశించారు ఈసారి యాత్ర మార్గంలో ప్రతి 10 Read more

తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్‌ జారీ
Change of names of 8 castes in Telangana.. Notification issued

హైదరాబాద్‌: కులం పేర్లను ఇప్పటికీ , తిట్లగా ఉపయోగిస్తున్నారు. సినిమాలు, రాజకీయాల వేదికలపై కొన్ని కులాల పేర్లు మనస్సుని బాధించేలా, అవమాన కరంగా వాడబడుతున్నాయి. ఈ విషయం Read more

భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి

టోకెన్లు లేదా టికెట్లలో పేర్కొన్న సమయానికి మాత్రమే క్యూలైన్లలోకి రావాలి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక విజ్ఞప్తి చేసింది. Read more

Property Tax : ఆస్తి పన్ను వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ
Mega DSC Notification in March .. AP Govt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ శుభవార్త అందించింది. పలు నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిలు అధికంగా పేరుకుపోవడంతో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. Read more

×