అమెరికాలో భారతీయులను వెంటాడుతున్న సెల్ఫ్ డిపోర్టేషన్ భయం

అమెరికాలో భారతీయులను వెంటాడుతున్న సెల్ఫ్ డిపోర్టేషన్ భయం

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రావడంతో భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. H4 వీసా కింద ఉన్న వేలాది మందికి కొత్త టెన్షన్ హెచ్ వన్ బి వీసా హోల్డర్లు అయిన తల్లిదండ్రులపై ఆధారపడి, వారితో పాటు అమెరికా వెళ్ళిన పిల్లలు h4 వీసా కింద అప్పట్లో మైనర్లుగా వలస వెళ్లారు. అయితే ప్రస్తుతం వారి మైనారిటీ తీరి వారి వయసు 21 సంవత్సరాలకు చేరుకుంటూ ఉండటంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. అమెరికాలోని ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం వారు హెచ్ వన్ బి వీసా హోల్డర్ ఆయన తల్లిదండ్రులపైన ఆధారపడేవారికి అర్హత ఉండదు.
ఇప్పటికే అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపుతున్న ట్రంప్, అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థుల పైన కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయుల పిల్లల పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది.

Advertisements
టెక్సాస్ కోర్టు ఇచ్చిన తీర్పు


వలసదారులపై తీవ్ర ప్రభావం
భారతీయ వలసదారులపై తీవ్ర ప్రభావం
కాబట్టి వారు కచ్చితంగా మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ భయం భారతీయులను మరింత ఇబ్బంది పెడుతుంది. తాజా పరిణామాలతో చాలామంది ఇప్పుడు కెనడా, యూకే వంటి దేశాలకు వలస వెళుతున్నారు. ఇక తమను తాము రక్షించుకోవడానికి ఇతర మార్గాలను అన్వేషించుకుంటున్నారు. మరోవైపు అమెరికాలో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు వ్యవస్థలో భారీ స్థాయిలో పెండింగ్ అప్లికేషన్స్ ఉండడం వలన అది భారతీయ వలసదారులను ప్రభావితం చేస్తుంది. మేజర్లు అయిన హెచ్ 1 బీ వీసాదారుల పిల్లల భవిష్యత్ పై సందిగ్ధత తల్లిదండ్రులు ఉద్యోగాల మీద యుఎస్ వెళ్తే వారితో పాటు మైనర్లుగా యూఎస్ కి వెళ్లిన పిల్లలు ఇప్పుడు మైనారిటీ తీరి 21వ పుట్టినరోజు చేసుకుంటున్న వేళ వారి పరిస్థితి ఏమిటి అన్నది దారుణమైన సందిగ్ధతగా మారింది. యూఎస్ లో ఇలాంటివారు వేరే వీసా విధానానికి మారడానికి రెండు సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
దిక్కు తోచని స్థితిలో 1. 34 లక్షల మంది
అయితే ప్రస్తుతం ట్రంప్ తీసుకువచ్చిన కొత్త విధానాలు, కొనసాగుతున్న కోర్టు కేసుల పుణ్యం తో ఈ గ్రేస్ పీరియడ్ నిబంధన ఇప్పుడు అమలులో ఉందా లేదా అన్న సందిగ్ధత కూడా కొనసాగుతుంది. అయితే దీనిపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. సుమారు 1. 34 లక్షల మంది భారతీయ హెచ్ వన్ బి వీసా డిపెండెంట్ వీసా నుండి బయటకు వస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

టెక్సాస్ కోర్టు ఇచ్చిన తీర్పు

ఇటీవల టెక్సాస్ కోర్టు తీర్పుతో మరింత టెన్షన్ ఇండియా నుంచి వెళ్లి ఇంతకాలం పనిచేస్తున్న తల్లిదండ్రులు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తుంటే, వీరికి తాజా పరిణామాలతో అక్కడ ఉండే అర్హత లేకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది. ఇక ఇదే సమయంలో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్ కింద కొత్త దరఖాస్తుదారులకు వర్క్ పర్మిట్లను ఇవ్వకుండా నిలిపివేస్తూ ఇటీవల టెక్సాస్ కోర్టు ఇచ్చిన తీర్పు ఈ గందరగోళాన్ని మరింత పెంచింది. ఇక ఈ అనిశ్చితితో భారతీయులు భారతీయుల పిల్లలు భవిష్యత్తు పైన తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Related Posts
తుర్కియే రాజధానిలో ఉగ్రదాడి
turkey major terrorist atta

తుర్కియే రాజధాని అంకారాలో తీవ్ర ఉగ్రదాడి ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడి టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TAI) కహ్రమన్‌కాజాన్ ఫెసిలిటీలో జరిగింది. ఉగ్రవాదులు సాయుధంగా ప్రవేశించి, Read more

కల్పన ఆత్మహత్య కేసులో భర్తని విచారిస్తున్న పోలీసులు
కల్పన ఆత్మహత్య కేసులో భర్తని విచారిస్తున్న పోలీసులు

కల్పన ఆత్మహత్యాయత్నం: నిద్ర మాత్రలు మింగి పరిస్థితి విషమం ప్రపంచానికి తన గాత్రంతో అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ప్రముఖ నేపథ్యగాయని కల్పన నిద్ర మాత్రలను Read more

పోలవరంపై బడ్జెట్ కు ముందే రాష్ట్రపతి ప్రకటన!
droupadi murmu

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీలక ప్రసంగం చేశారు. ఉభయసభలనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆమె వివరించారు. Read more

అమెరికాలో బర్డ్ ఫ్లూతో తొలి మరణం
bird flu

ప్రపంచాన్ని హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్‌‌ఎంపీవీ) వైరస్ భయపెడుతున్న వేళ అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ (హెచ్5ఎన్1) మరణం కేసు నమోదు కావడం మరింత కలవరానికి గురిచేస్తున్నది. Read more

×