సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియన్స్ క్రేజ్ చూసారా!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియన్స్ క్రేజ్ చూసారా!

విక్టరీ వెంకటేష్,సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా చేసిన యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మహేష్ బాబు లవర్ బాయ్ క్యారెక్టర్, వెంకీ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్, ప్రకాష్ రాజ్, జయసుధ వంటి సీనియర్ నటుల అద్భుతమైన నటనతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

రీ-రిలీజ్

తాజాగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మార్చి 7న రీ-రిలీజ్ కావడంతో మహేష్ బాబు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. గుంటూరు కారం తర్వాత మహేష్ రాజమౌళి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో, ఆయన సినిమాల కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది పండుగలా మారింది. థియేటర్లలో అభిమానులు హంగామా చేస్తూ డాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా పాటలు

ఈ సినిమా పాటలు అప్పట్లోనే ట్రెండ్ సెట్ చేయగా, ఇప్పుడు రీ-రిలీజ్‌తో మళ్లీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో ఓ లేడీ చేసిన డాన్స్ వీడియో నెట్టింట షేక్ చేస్తోంది. “ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇంతగా ఎంజాయ్ చేస్తే, మహేష్ బాబు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతోంది.

16409982

మహేష్ బాబు కామెడీ టైమింగ్,వెంకీ యాక్టింగ్ అదిరిందనే చెప్పాలి. అన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో సమంత, అంజలి, అభినయ, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. అయితే ఈసినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు మహేష్ బాబు, వెంకటేష్. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు.

Related Posts
మరో హాలీవుడ్‌ సినిమా చేయనున్న ధనుష్..
holly wood dhanush

తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా దూసుకుపోతున్నాడు. హిట్, ఫ్లాప్ అన్న విషయాలకు సంబంధం లేకుండా వరుస సినిమాలు లైనప్ చేశాడు. తమిళం, హిందీ, Read more

పంజాబీ డ్రెస్‌లో కేరళ కుట్టి 50కి దగ్గరైనా తగ్గడం లేదుగా
suma kanakala

తెలుగు బుల్లితెరపై కీర్తి తెచ్చుకున్న స్టార్ యాంకర్ సుమ కనకాల, అనేక మంది వచ్చినా ఇంకా తన స్థానాన్ని దృఢంగా నిలబెట్టుకున్నారు. కేరళలో జన్మించిన సుమ, 20 Read more

AR Rahman:ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత
AR Rahman: హాస్పిటల్ నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జి

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ భారతదేశపు గొప్ప సంగీత స్వరకర్తలలో ఒకరు.ఆయన ఆకస్మిక అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక సమాచారం ప్రకారం,చాతి నొప్పి Read more

క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న బాలీవుడ్ నటి ఎవరంటే?
క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న బాలీవుడ్ నటి ఎవరంటే.

సంతోషాన్ని పంచుకునే వాళ్లతో పాటు, కష్టాలను కూడా పంచుకునేవాళ్లు నిజమైన ఆప్తులు.మనం బాధల్లో ఉండగా, మనతో ఉండి ధైర్యం చెప్పేవాళ్లు అరుదు.ఈ క్రమంలో, బాలీవుడ్ నటి హీనా Read more