हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Sarzameen: ‘సర్జమీన్’ (జియో హాట్ స్టార్) ఓటీటీ రివ్యూ!

Ramya
Sarzameen: ‘సర్జమీన్’ (జియో హాట్ స్టార్) ఓటీటీ రివ్యూ!

‘సర్జమీన్’ (Sarzameen) ఓటీటీ రివ్యూ: దేశభక్తి – కుటుంబ భావోద్వేగాల మధ్య సందిగ్ధత

నిన్నటి నుంచి జియో సినిమా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సర్జమీన్’ (Sarzameen) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్, ఇబ్రహీం అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించారు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. కాశ్మీర్‌లోని ఉగ్రవాద నేపథ్యం, సైన్యం పోరాటం, ఆర్మీ కుటుంబాలు (Army families) ఎదుర్కొనే సవాళ్లను చిత్రీకరించిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

Sarzameen: 'సర్జమీన్' (జియో హాట్ స్టార్) ఓటీటీ రివ్యూ!
Sarzameen: ‘సర్జమీన్’ (జియో హాట్ స్టార్) ఓటీటీ రివ్యూ!

కథా నేపథ్యం

కాశ్మీర్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులు, అమాయకుల ప్రాణనష్టం కథకు కేంద్ర బిందువు. ఈ దాడుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ‘కాబిల్’ అలియాస్ ‘మోసెన్’ అని తెలియడంతో, అతన్ని పట్టుకోవడానికి కల్నల్ విజయ్ మీనన్ (Prithviraj Sukumaran) తన బృందంతో రంగంలోకి దిగుతాడు. తన తండ్రి స్ఫూర్తితో ఆర్మీలో చేరిన విజయ్ మీనన్‌కు దేశం తప్ప మరో ఆలోచన ఉండదు. అతని కుటుంబం అంటే భార్య మెహర్ (కాజోల్), టీనేజ్ కొడుకు హర్మన్ (ఇబ్రహీం అలీఖాన్). హర్మన్ మానసిక సమస్య కారణంగా నత్తిగా మాట్లాడటమే కాకుండా పిరికివాడిలా ప్రవర్తిస్తాడు. ఈ విషయంలో విజయ్ మీనన్ అసంతృప్తిగా ఉండగా, మెహర్ మాత్రం కొడుకును సమర్థిస్తూ భర్తకు నచ్చజెబుతూ ఉంటుంది. ఈ క్రమంలో విజయ్ మీనన్ కాబిల్‌ను పట్టుకుంటాడు. దాంతో ఉగ్రవాదులు హర్మన్‌ను కిడ్నాప్ చేసి, కాబిల్‌ను విడిచిపెట్టకపోతే చంపేస్తామని హెచ్చరిస్తారు. దేశాన్ని కాపాడుకోవడమా లేక కొడుకును రక్షించుకోవడమా అనే సందిగ్ధంలో పడిన విజయ్ మీనన్ చివరికి ఏ నిర్ణయం తీసుకుంటాడు, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మిగతా కథ.

విశ్లేషణ

కాశ్మీర్ తీవ్రవాదం, ఆర్మీ పోరాటం, ఆర్మీ కుటుంబాల సమస్యల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ‘సర్జమీన్’ (sarzameen) కేవలం యాక్షన్ మూవీగానే కాకుండా, దేశభక్తితో పాటు కుటుంబ భావోద్వేగాలకూ ప్రాధాన్యతనిచ్చింది. ఒకవైపు దేశం, మరోవైపు ఉగ్రవాదం, ఇంకోవైపు సైనిక కుటుంబం – ఈ మూడు అంశాలను కలిపి దర్శకుడు కొత్తదనాన్ని చూపాలని ప్రయత్నించారు. తండ్రి ప్రేరణతో సైన్యంలో చేరిన విజయ్ మీనన్ ఆశయసాధనకు కొడుకు అడ్డంకిగా మారతాడు. తండ్రి మాటలు, కొడుకు పనులు విజయ్‌ను సతమతం చేస్తాయి. తన లోపాన్ని అర్థం చేసుకోలేని తండ్రి పట్ల అసంతృప్తితో ఉన్న కొడుకుగా హర్మన్ పాత్ర, ఈ ఇద్దరి మధ్య నలిగిపోయే మెహర్ పాత్రలను దర్శకుడు డిజైన్ చేశారు. అయితే, ఆశించిన స్థాయిలో భావోద్వేగాలు ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోవడం ఆశ్చర్యకరం.

దర్శకుడు కొత్తదనం కోసం యాక్షన్, ఎమోషన్స్‌కు ప్రాధాన్యతనిచ్చినప్పటికీ, ఎమోషన్స్‌లో బలం లేకపోవడంతో యాక్షన్ సన్నివేశాలు కూడా తేలిపోయాయి. హీరో తీసుకునే నిర్ణయాలు కథను సహజత్వానికి దూరం చేసి సన్నివేశాలను బలహీనపరుస్తాయి. కథలో తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు సులభంగా ఊహించగలుగుతారు. అందువల్ల ‘సర్జమీన్’ ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిందనిపిస్తుంది.

నటీనటుల పనితీరు, సాంకేతిక అంశాలు

నిర్మాణ పరంగా ఈ సినిమాకు ఎటువంటి లోపాలూ లేవు. కమల్ జీత్ నేగి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. కాశ్మీర్ లొకేషన్స్‌ను కవర్ చేసిన తీరు బాగుంది. విశాల్ మిశ్రా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సందర్భానికి తగినట్లుగా కుదిరింది. నితిన్ బైద్ ఎడిటింగ్‌లో కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కథాకథనాల పరంగా మాత్రం బలహీనంగా కనిపిస్తుంది. దేశభక్తి – ఉగ్రవాదం పాళ్లు తగ్గించి, కుటుంబ భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టడం, ఆ ట్రాక్ నిదానంగా సాగడం మరో మైనస్‌గా కనిపిస్తుంది. ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులంతా తమ పాత్రల్లో బాగానే నటించారు.

ముగింపు

ఒకవైపు దేశభక్తి, మరోవైపు కుటుంబ భావోద్వేగాలను కలిపి అల్లిన కథ ఇది. అయితే, ఈ రెండు ట్రాక్‌లకు పూర్తి న్యాయం జరగలేదనిపిస్తుంది. హృదయం ఉప్పొంగే దేశభక్తి సన్నివేశాలు కానీ, మనసును కదిలించే భావోద్వేగాలు కానీ లేకపోవడమే ఈ కథలోని ప్రధాన లోపంగా కనిపిస్తుంది. మొత్తంగా ‘సర్జమీన్’ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలమైందనే చెప్పాలి.

‘సర్జమీన్’ సినిమా ఎక్కడ జరిగింది?

కాశ్మీర్‌లో మంచుతో కప్పబడిన అద్భుతమైన ప్రదేశాలు మనకు లభిస్తాయి మరియు ‘సర్జమీన్’ను సురక్షితంగా ఉంచడమే మా లక్ష్యం. కానీ చివరికి పెద్ద రివీల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

సర్జమీన్ చిత్రాన్ని ఏ సినిమా సంస్థ నిర్మించింది?

సర్జమీన్ చిత్రాన్ని హీరో యష్ జోహార్, కరణ్ జోహార్, అదార్ పూనావల్ల, అపూర్వ మెహతా మరియు స్టార్ స్టూడియోస్ నిర్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Ittymani: Made in China: ‘ఇట్టిమాని: మేడ్ ఇన్ చైనా’ (ఈటీవీ విన్) సినిమా రివ్యూ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870