రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కొంత ఆలస్యంగా జరిగే అవకాశముంది. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం ఆమోదించింది. అలాగే కులగణనలో పాల్గొని వారికీ మరొకసారి అవకాశం కల్పించింది. అయితే కేంద్రం ఆమోదం తెల్పిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఎన్నికల వాయిదా కారణం?
గ్రామపంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలు కొంత కాలంగా అనిశ్చితిలోనే ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందాక పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపాయి.
రాజకీయుల విశ్లేషక స్పందన: గతంలో పలువురు మంత్రులు కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పట్లో ఎన్నికలు జరిగేలా లేవు మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇది ప్రభుత్వ వ్యూహాత్మక నిర్ణయమని అంచనా వేస్తున్నారు.
ప్రజల్లో అసంతృప్తి: ఇప్పటికే తెలంగాణ పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మెుదలైంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు పలువురు ఆసక్తిదారులు సిద్ధమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని చోట్ల ప్రచారం కూడా మెుదలుపెట్టారు. కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేక మేనిఫెస్టోలు, సర్పంచ్ పదవి వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని ఆశగా చూస్తున్నారు
బీసీ రిజర్వేషన్ల అమలు, ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించి, మంత్రులు, ఉన్నతాధికారులతో దీర్ఘ చర్చలు జరిగాయి. చర్చల అనంతరం ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రం ఆమోదం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.
అసెంబ్లీ తీర్మానం తర్వాత కేంద్రం ఆమోదం అవసరం కేంద్రం ఆమోదం వచ్చిన తర్వాత రిజర్వేషన్లపై నిర్ణయం తదుపరి ప్రక్రియ పూర్తి చేసి ఎలక్షన్ కమిషన్‌కు నివేదిక అందించాలి ఇదంతా పూర్తయిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం.