हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Sarangapani Jathakam Movie: ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘సారంగపాణి జాతకం’ మూవీ

Anusha
Sarangapani Jathakam Movie: ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘సారంగపాణి జాతకం’ మూవీ

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియదర్శి నటించిన ‘సారంగపాణి జాతకం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం కావడం విశేషం.ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుండ‌గా తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వ‌చ్చింది.మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, నరేష్, వెన్నెల కిషోర్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథఏంటంటే

ప్ర‌ముఖ కార్ల కంపెనీలో సేల్స్‌మెన్‌గా ప‌నిచేస్తుంటాడు సారంగపాణి (ప్రియదర్శి). త‌న ప‌నిత‌నంతో రెండేండ్ల నుంచి బెస్ట్ ఎంప్లాయ్‌గా కొన‌సాగుతుంటాడు. అయితే అదే కార్ల కంపెనీలో మేనేజ‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుంటుంది మైథిలీ (రూప కొడువాయూర్). మైథిలీ అంటే సారంగ‌పాణికి చాలా ఇష్టం. ఇదే విష‌యాన్ని త‌న‌కు చెబుదామ‌నుకుంటాడు. కానీ పాణికి చిన్ననాటి నుంచి జ్యోతిష్యం మీదా న‌మ్మకం ఎక్కువ‌ త‌న లైఫ్‌లో ఏం ప‌నిచేసిన గ్ర‌హాలు అనుకులంగా ఉన్నాయా అని చూసుకొని పని మొదలుపెడతాడు. దీంతో మైథిలీతో ప్రేమ విష‌యం కూడా మంచి ముహూర్తం చూసి చెప్పాలనుకుంటాడు. అయితే మైథిలీ మాత్రం న‌మ్మ‌కాల్ని ప‌ట్టించుకోని ఆధునిక భావాల‌తో పెరిగిన ఒక యువతి. పాణి ముహూర్తం చూసి చెప్పాలి అనుకునే గ్యాప్‌లో మైథిలీ వచ్చి పాణికి ప్ర‌పోజ్ చేసేస్తుంది. దీంతో వారి ప్రేమ క‌థ సంతోషంగా సాగుతూ పెళ్లి వ‌ర‌కు వెళుతుంది.

 Sarangapani Jathakam Movie: ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘సారంగపాణి జాతకం’ మూవీ
Sarangapani Jathakam Movie:

స్నేహితుడు

ఈ క్ర‌మంలోనే సారంగ‌పాణి ఒక‌రోజు ప‌బ్‌లో ఉండ‌గా అత‌డిని జిగేశ్వరానంద (అవసరాల శ్రీనివాస్) అనే ఒక హస్తసాముద్రికుడు(Palmist) చూసి అత‌డి చేతిని పరిశీలించి భవిష్యత్తులో ఒక హత్య చేస్తాడని జోస్యం చెబుతాడు. జాత‌కాల‌ను గ‌ట్టిగా న‌మ్మే పాణి జిగేశ్వరానంద చెప్పింది విని ఆందోళ‌న చెందుతాడు. మ‌ర్డ‌ర్ చేస్తాను అనే భ‌యంతో త‌న పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటాడు. అయితే త‌న జాత‌కంలో హ‌త్య చేయాలి అని ప‌క్క‌రాసి ఉంది కాబ‌ట్టి ఆ హ‌త్య ఏదో పెళ్లికి ముందు చేసేసి లైఫ్‌లో సెటిల్ అయిపోదాం అనుకుంటాడు పాణి. ఈ క్ర‌మంలోనే త‌న చిన్ననాటి స్నేహితుడు అయిన చందు (వెన్నెల కిశోర్) సాయం కోర‌తాడు. అయితే సారంగ‌పాణి, చందూ క‌లిసి హ‌త్య చేయాల‌నుకుంటున్న వ్య‌క్తి ఎవ‌రు. పాణి, చందూ క‌లిసి ఆ హ‌త్య చేశారా. ఈ జిగేశ్వరానంద ఎవ‌రు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Read Also: Aishwarya Rai: బాడీ షేమింగ్ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన ఐశ్వ‌ర్య‌రాయ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870