వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఫామిలీ & యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 14 తేదీన రిలీజ్ అయ్యింది. విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత కూడా అదే టాక్ రావడంతో సినిమాను చూసేందుకు సినీ లవర్స్ పోటీ పడుతున్నారు. మొదటినుండి కూడా వెంకీ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం తో ఫ్యామిలీ ఆడియన్స్ తో హౌస్ ఫుల్ అవుతుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.
దీంతో వెంకటేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు రాబట్టిన మూవీ గా మేకర్స్ చెబుతున్నారు. శనివారం ఒక్కరోజే ఈ సినిమా రూ.31 కోట్లను కలెక్ట్ చేసిందని, ఆదివారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చిత్రబృందం పేర్కొంది. ఐదు రోజుల్లో రూ.161 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అధికారికంగా వెల్లడించింది. రాబోయే రోజుల్లో కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం పక్క అని అభిమానులు అంటున్నారు. ఈ మూవీ తో పోలిస్తే గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవ్వడం , డాకు మహారాజ్ సైతం యావరేజ్ అనిపించుకోవడం తో వెంకీ సినిమాకు డిమాండ్ పెరిగింది. ఫైనల్ వరకు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి.