हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Sajjala Ramakrishna Reddy: కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే వ్యతిరేకత: సజ్జల

Anusha
Sajjala Ramakrishna Reddy: కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే వ్యతిరేకత: సజ్జల

రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై,తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తికాకముందే,ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.వైసీపీ(YCP) ఆధ్వర్యంలో జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని, ఇది ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల ఆగ్రహానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

అధికారంలోకి

సజ్జల నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మేము ఊహించినదానికంటే ఎక్కువగా ప్రజలు ‘వెన్నుపోటు దినం’లో పాల్గొన్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టం చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న తీరుపై ప్రజలు విసుగెత్తిపోయారు” అని ధ్వజమెత్తారు. చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసిందని, ఈ నిధులు ఏమయ్యాయో, ఏయే వర్గాలకు ప్రయోజనం చేకూరిందో చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు.

ప్రభుత్వానికి హెచ్చరిక

కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ. జగన్ నాయకత్వంలో 15 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని కేవలం మూడేళ్లలోనే చేసి చూపించాం. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 99 శాతం హామీలను నెరవేర్చాం. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలను ఆదుకున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశాం” అని సజ్జల గత వైసీపీ పాలనను గుర్తుచేశారు.ప్రస్తుత టీడీపీ(TDP) ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ, “చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్నారు. ఇప్పటికే నాలుగు లక్షల మంది అర్హులైన వారికి పింఛన్లు కట్ చేసి వారి ఉసురు పోసుకుంటున్నారు. జగన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల(Welfare schemes)కు మంగళం పాడారు. ఈ తీరు చూస్తుంటే ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవు. ‘వెన్నుపోటు దినం’ విజయం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక” అని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చిన ఈ విశేష స్పందన, తమ భవిష్యత్ పోరాటాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Read Also: AP Elections Results Day : ఏపీ ఎన్నికల ఫలితాలకు ఏడాది!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870