हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: రాజస్థాన్ రాయల్స్ ఓటమి పై స్పందించిన రియాన్ పరాగ్

Anusha
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ ఓటమి పై స్పందించిన రియాన్ పరాగ్

ఐపీఎల్ 2025లో భాగంగా,ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70), దేవదత్ పడిక్కల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా జోఫ్రా ఆర్చర్, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.9 ఓవర్లకే వంద పరుగుల మార్కును దాటిన రాజస్థాన్‌ స్పిన్నర్ల రాకతో తడబడింది. పది బంతుల్లోనే రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో జోరు మీద కపిపించిన సారథి రియాన్‌ పరాగ్‌ (22)ను కృనాల్‌ పదో ఓవర్లో ఫస్ట్‌బాల్‌కే బోల్తా కొట్టించాడు. సుయాశ్‌ వికెట్లేమీ తీయకపోయినా పరుగులను కట్టడి చేశాడు. కృనాల్‌ 14వ ఓవర్లో నితీశ్‌నూ ఔట్‌ చేయడంతో రాజస్థాన్‌ కష్టాల్లో పడింది.హెట్‌మెయర్‌ (11)ను హాజిల్‌వుడ్‌ పెవిలియన్‌కు పంపాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా జురెల్‌ మాత్రం క్రీజులో నిలిచాడు. చివరి 3 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 40 పరుగులు అవసరమవగా భువీ 18వ ఓవర్లో జురెల్‌ 6, 4, 4 రాబట్టగా శుభమ్‌ (12) ఓ సిక్సర్‌ కొట్టడంతో రాజస్థాన్‌ గెలుపు రేసులోకి వచ్చింది. కానీ హాజిల్‌వుడ్‌ 19వ ఓవర్లో ఒకే పరుగిచ్చి జురెల్‌, ఆర్చర్‌ను ఔట్‌ చేశాడు. దయాల్‌ ఆఖరి ఓవర్లో తొలి బంతికే శుభమ్‌ను ఔట్‌ చేయడంతో బెంగళూరు విజయం ఖరారైంది.

 IPL 2025: రాజస్థాన్ రాయల్స్ ఓటమి పై స్పందించిన రియాన్ పరాగ్

విజయావకాశాలు

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రియాన్ పరాగ్ ఆర్‌సీబీ స్పిన్నర్లు తమ విజయవకాశాలను దెబ్బతీసారని తెలిపాడు. ‘మేం బంతితో అద్భుత ప్రదర్శన కనబర్చాం. ఇది 210-220 పరుగులు చేయాల్సిన వికెట్. సరైన సమయంలో పుంజుకొని ఆర్‌సీబీని తక్కువ పరుగులకే కట్టడి చేశాం. బ్యాటింగ్‌లోనూ సగం మ్యాచ్‌ ముగిసే వరకు మాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మరోసారి మిలార్డర్, లోయరార్డర్ బ్యాటర్ల వైఫల్యం జట్టు ఓటమిని శాసించింది.స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాం. వారిపై సరైన ఇంటెంట్ చూపించలేకపోయాం. స్వేచ్చగా దూకుడుగా ఆడాల్సిన బాధ్యత ఆటగాళ్లపై ఉంది. ఈ టోర్నీలో ఒక్క తప్పిదం చేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ రోజు అదే జరిగింది. ఇప్పటికే మా ప్రదర్శనపై సుదీర్ఘమైన చర్చలు జరిపాం. ఈ మ్యాచ్‌ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. కానీ మా వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. మేం గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నాం. ఇక నుంచి మేం పరువు కోసం ఆడాల్సిందే. ‘అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.

Read Also: Vaibhav Suryavanshi: తన బ్యాటింగ్ తో అందర్నీ ఆకట్టుకుంటున్న వైభవ్ సూర్యవంశీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870