हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పై స్పందించిన రిషబ్ పంత్

Anusha
IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పై స్పందించిన రిషబ్ పంత్

ఐపీఎల్ 2025లో భాగంగా , 40వ మ్యాచ్ ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్డేడియంలో జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఐడెన్ మార్‌‌క్రమ్ 52 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్, దుష్మంత చమీర తలా ఒక వికెట్ పడగొట్టారు. లక్నో నిర్జేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు కోల్పోయి సులభంగా ఛేదించింది. ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్ 57 పరుగులతో భారీ స్కోరర్ గా నిలవగా అభిషేక్ పోరెల్ 51 పరుగులు, అక్షర్ పటేల్ 34 పరుగులు చేశారు. లక్నో తరపున ఐడెన్ మార్‌‌క్రమ్ 2 వికెట్ల పడగొట్టాడు. ఈ సారి ఓటమి తర్వాత రిషబ్ పంత్ కీలక ప్రకటన చేశాడు.

తొలి వికెట్‌

తొలి ఇన్నింగ్స్‌లో భిన్నంగా స్పందించడంతో పంత్‌ సేనకు బ్యాటింగ్‌ తిప్పలు తప్పలేదు. పిచ్‌ స్వభావం తెలిసిన ఢిల్లీ సారథి అక్షర్‌ బౌలింగ్‌ దాడిని ప్రారంభించడంతో పాటు పవర్‌ ప్లేలో వరుసగా మూడు ఓవర్లూ (19 పరుగులే ఇచ్చాడు) తానే వేశాడు. మార్ష్‌ (45) బ్యాట్‌ ఝుళిపించేందుకు ఇబ్బందులు పడగా మార్క్మ్‌ కూడా ఆరంభంలో తడబడ్డా తర్వాత పుంజుకున్నాడు.ముకేశ్‌ 4వ ఓవర్లో అతడు 4, 6 కొట్టగా చమీర ఓవర్లో మార్ష్‌ సిక్సర్‌తో లక్నో 50 పరుగుల మార్కును అందుకుంది. గత ఆరు ఇన్నింగ్స్‌లలో అతడికి ఇది నాలుగో అర్ధ శతకం. కానీ మార్క్మ్‌,మార్ష్‌ క్రీజులో ఉన్నా 10 ఓవర్లకు లక్నో చేసింది 87 పరుగులే. 9వ ఓవర్‌ ఆఖరి బంతికి చమీర మార్క్మ్‌న్రు ఔట్‌ చేసి 87 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. పూరన్‌ (9)ను స్టార్క్‌ బోల్తా కొట్టించాడు. ముకేశ్‌ 14వ ఓవర్లో సమద్‌ (2)తో పాటు మార్ష్‌నూ ఔట్‌ చేసి లక్నోకు డబుల్‌ షాకులిచ్చాడు. బదోని (21 బంతుల్లో 36, 6 ఫోర్లు) వేగంగా ఆడగా 15 బంతులెదుర్కున్న మిల్లర్‌ (14 నాటౌట్‌) ధాటిగా ఆడలేకపోయాడు.

  IPL 2025:  లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పై స్పందించిన రిషబ్ పంత్

సాకులు వెతకడం

లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ “మేము 20 పరుగులు వెనుకబడి ఉన్నామని మాకు తెలుసు. టాస్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎవరు ముందుగా బౌలింగ్ చేసినా వికెట్ నుంచి చాలా సహాయం లభిస్తుంది. మేము కొంచెం వెనుకబడ్డామని తెలుసు కానీ దానిని సరిదిద్దలేకపోయాం. లక్నోలో ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ పిచ్ మీద టాస్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ మేము సాకులు వెతకడం లేదు.” అని రిషబ్ పంత్ అన్నాడు.మయాంక్ కు ఇంకా సమయం ఇస్తున్నట్లు రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో అబ్దుల్ సమద్, ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ ను పంపాలనే ఆలోచన వచ్చిందని పంత్ చెప్పాడు. ముందుకు సాగడానికి ఉత్తమ కలయికను కనుగొనడానికి ప్రయత్నించాలని రిషబ్ పంత్ స్పష్టం చేశాడు.

Read Also: IPL 2025: రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు స్పందించిన బీసీసీఐ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870