RevanthReddy:కేసీఆర్ కి చెక్ పెట్టె దిశగా రేవంత్ అడుగులు

RevanthReddy:కేసీఆర్ కి చెక్ పెట్టె దిశగా రేవంత్ అడుగులు

తెలంగాణ సెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసా గుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండు చారిత్రాత్మక బిల్లులు – బీసీ రిజర్వేషన్లు పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు – ఈరోజు, రేపు అసెంబ్లీ వేదికగా చర్చకు రానున్నాయి. ఈ బిల్లులు ఆమోదం పొందితే, రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉంది.

Advertisements

బీసీ రిజర్వేషన్లు – 42% కు పెంపు

బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం తో పాటుగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత అంశాలను కల్పించేలా రూపకల్పన చేసిన బిల్లులు సభ ముందుకు తెస్తోంది.ఈ రెండు బిల్లులకు ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలపడంతో బిల్లులకు శాసనసభలో ప్రవేశ పెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణలపై శాసనసభ, మండలిలో ఈ రోజు రేపు (సోమ, మంగళ వారం) ప్రత్యేక చర్చ జరగనుంది.

ఎస్సీ వర్గీకరణ – సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి చట్టబద్ధత

ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో చర్చకు రానుంది.ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీం తీర్పుతో తెలంగాణలో అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో న్యాయ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రభుత్వం జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ ఇచ్చని నివేదికలో ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని సిఫారసు చేసింది.

అసెంబ్లీలో చర్చ

ఈ వివరాలను ప్రభుత్వం సభలో వెల్లడించింది. కాగా, గ్రూపుల వర్గీకరణపై మరికొన్ని కుల సంఘాల నుంచి అభ్యంతరాలు, సూచనలు రావడంతో వాటిని పరిశీలించాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. వాటిని పరిశీలించి న షమీమ్ అక్తర్ కమిషన్‌ తాజాగా ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక మేరకు బిల్లు సిద్దమైంది. దీంతో, ఈ రెండు రోజులు అసెంబ్లీలో ఈ బిల్లుల పైన చర్చ కీలకంగా మారనుంది.

xr:d:DAF8H5SmlV0:4,j:848220581572788598,t:24020715

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలు రాష్ట్ర సామాజిక నిర్మాణంలో గొప్ప మార్పుకు దారి తీసే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ వర్గాలకు న్యాయం చేయడంలో ఈ చట్టాలు కీలకపాత్ర పోషించనున్నాయి.రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై ఈ చర్చ ఎంత ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సి ఉంది.

Related Posts
SLBC Tunnel: 36వ రోజుకు చేరుకున్నఎస్ఎల్‌బీసీ సహాయక చర్యలు
SLBC Tunnel: SLBC టన్నెల్ ప్రమాదం- 36 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ ప్రమాదం సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. రెస్క్యూ బృందాలు చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు నిరంతర Read more

ఈనెల 30 నుండి బీఆర్‌ఎస్‌ “గురుకుల బాట” కార్యక్రమం: కేటీఆర్‌
Will march across the state. KTR key announcement

హైదరాబాద్‌ : గురుకులాల్లో చోటు చేసుకుంటున్న వరుస విషాద ఘటనల నేపథ్యంలో ఈనెల 30 నుండి డిసెంబర్‌ ఏడో తేదీ వరకు బీఆర్ఎస్‌ పార్టీ తరపున "గురుకుల Read more

ఎంపీ రఘునందన్ రావు అరెస్ట్
mp raghunandan rao arrest

మెదక్‌ బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావును జనవరి 17న పోలీసులు అరెస్ట్ చేశారు. వెలిమల తండాలో గిరిజనుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన రఘునందన్ రావును సాయంత్రం అదుపులోకి Read more

ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు
si and constable death

తెలంగాణలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ డెత్ కేసులో చిక్కుముడులు వీడనున్నాయి. భిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురూ Read more

Advertisements
×