हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

Retro Movie: రెట్రో మూవీ రివ్యూ

Anusha
Retro Movie: రెట్రో మూవీ రివ్యూ

కోలీవుడ్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీం చిత్రాలు ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఆ తరువాత సూర్య నటించిన ఏ చిత్రం కూడా థియేటర్లో కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. చివరగా కంగువా అంటూ వచ్చి బొక్క బోర్లా పడ్డాడు. ఈ సారి కార్తిక్ సుబ్బరాజ్‌తో కలిసి ‘రెట్రో’ అంటూ వచ్చాడు. మే 1న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. అసలే కార్తిక్ సుబ్బరాజ్ అంటే కమర్షియల్‌గా అంత సెట్ అవ్వదు అనే భావనతో అంతా ఉంటారు. మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో లేదో మూవీ రివ్యూ లో చూద్దాం.

కథ

రౌడీ అయిన తిలక్ (జోజు జార్జ్)కు పెంపుడు కొడుకు అయిన పారివేల్ కన్నన్ (సూర్య). చిన్నప్పటి నుంచీ నవ్వు అంటే ఏంటో కూడా తెలియకుండా పెరుగుతాడు పారివేల్. పారివేల్‌ను నవ్వించేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి అంతా అలిసిపోతారు. పెరిగి పెద్దైన తరువాత కూడా పారివేల్ నవ్వడు. అలాంటి పారివేల్ జీవితంలోకి రుక్మిణి (పూజా హెగ్డే) వస్తుంది. అన్నింటినీ వదిలేసి, హింసకు దూరంగా వెళ్లి రుక్మిణిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ గోల్డ్ ఫిష్ అనే డీల్ విషయంలో తిలక్‌కి, పారివేల్‌కు మనస్పర్థలు వస్తాయి. పెళ్లిలోనే తిలక్ చేతిని పారివేల్ నరికేస్తాడు. పారివేల్‌ను అరెస్ట్ చేస్తారు. దీంతో పెళ్లి ఆగిపోతోంది. ఆ తరువాత రుక్మిణి కూడా ఎవ్వరికీ కనిపించకుండా పోతుంది. జైల్లో ఉన్న పారివేల్‌తో గోల్డ్ ఫిష్ గురించిన నిజాన్ని తెలుసుకోవాలని ఐదేళ్లుగా తిలక్, ధర్మ (ప్రకాష్ రాజ్) ప్రయత్నిస్తుంటారు. కానీ పారివేల్ మాత్రం నోరు విప్పడు. పారివేల్ చేత నిజం చెప్పించాలంటే రుక్మిణి కావాల్సిందే అని తిలక్, ధర్మ ప్రయత్నిస్తుంటారు. మరోవైపు రుక్మిణి జాడ కోసం పారివేల్ కూడా ప్రయత్నిస్తుంటాడు. అండమాన్‌లోని ఓ దీవిలో రుక్మిణి ఉందని పారివేల్ తెలుసుకుంటాడు. ఫైటర్‌గా వెళ్తానని ఓ డీల్ కుదుర్చుకుని జైలు నుంచి తప్పించుకుటాడు పారివేల్. బయటకు వచ్చిన పారివేల్ తన డీల్‌ను వదిలేసి రుక్మిణి కోసం ఆ దీవికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తరువాత జరిగే పరిణామాలు ఏంటి? అసలు పారివేల్ ఒంటి మీద ఉండే మచ్చ ఏంటి? నవ్వంటే ఏంటో తెలియని ప్రజలున్న ఆ దీవికి పారివేల్ వెళ్లడంతో వచ్చిన మార్పులు ఏంటి? అసలు పారివేల్‌కి ఆ దీవికి ఉన్న లింక్ ఏంటి? అసలు ఈ గోల్డ్ ఫిష్ డీలింగ్ ఏంటి? ఆ దీవిలో రాజుల రూపంలో ఉన్న రాక్షసులైన రాజా వేల్ దొర (నాజర్), మైఖేల్‌ పాత్ర ఏంటి? అన్నది కథ.

 Retro Movie: రెట్రో మూవీ రివ్యూ

కథనం

రెట్రో మూవీ కథను ప్రేమ, హాస్యం, వార్, ధర్మం అంటూ ఇలా పార్టులు పార్టులుగా చూపించాడు కార్తిక్ సుబ్బరాజ్. ఓ మామూలు పాయింట్‌ను అటు తిప్పి ఇటు తిప్పి చూపించాడు దర్శకుడు. ప్రతీ మనిషి పుట్టుకకు ఓ కారణం ఉంటుందని స్టార్టింగ్‌లోనే కార్తిక్ సుబ్బరాజ్ డైలాగ్ రాసుకున్నాడు. అక్కడే ఈ సినిమా పాయింట్ ఏంటో అందరికీ అర్థం అవుతుంది. అంటే హీరో పాత్రకు ఏదో గతం ఉంటుందని హింట్ ఇచ్చేస్తాడు. అలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా గొడవలు, యాక్షన్ సీక్వెన్స్‌లు అంటూ ఇలా కథ ఎటెటో పోతుంది. ఎక్కడా కూడా ఒక్క హై మూమెంట్ కనిపించదు. అన్ని చోట్లా నీరసంగానే అనిపిస్తుంది. పాటలు కూడా ఉపశమనం కల్గించకపోగా తలనొప్పిలా అనిపిస్తాయి.

Read Also: Movie: ‘అతడు’ మూవీ రీరిలీజ్ ఎప్పుడంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870