వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికను జేపీసీ చైర్మన్‌గా వ్యవహరించిన జగదంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్ తదితరులు సభలో ప్రవేశపెట్టారు. ఈ ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు.

విపక్షాల నిరసన:
రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. దీనిపై విపక్ష పార్టీల ఎంపీలు నిరసన తెలిపారు. వారు తమ డిస్సెంట్ (అసమ్మతి) నోట్‌ను తొలగించినట్లు ఆరోపించారు. బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు. దేశంలో మతస్వేచ్చాను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. అనంతరం విపక్ష సభ్యులు డీఎంకే ఎంపీ కనిమొళి కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ ఇండియన్ముయూనియన్ ముస్లిం ఎంపీ బషీర్ బిల్లును వ్యతరేకించారు.ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ 20 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.
నివేదికలో ప్రధాన సవరణలు:
ముస్లిం ఓబీసీ సభ్యుల నియామకం: రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక సభ్యుడు ఉంటారు.ఇది ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా, వక్ఫ్ బోర్డుల నిర్వహణలో జోక్యంగా ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారు.
ప్రత్యేక వక్ఫ్ బోర్డులు: రాష్ట్ర ప్రభుత్వాలు అఘాఖానీ, బొహ్రా వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసే నిబంధనలు కూడా సవరణలలో ఉన్నాయి.
వక్ఫ్ అలాల్ ఔలాద్ (కుటుంబ వక్ఫ్‌లు): మహిళల వారసత్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించే నిబంధనలు.
ముసాయిదా బిల్లు ఆమోదం:
జనవరి 29న ముసాయిదా నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. 15-11 మెజారిటీతో ఈ నివేదిక ఆమోదించబడింది. కమిటీ ఆమోదించిన సవరణలను బీజేపీ సభ్యులు సూచించిన 14 సవరణలను కమిటీ ఆమోదించింది. అయితే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆప్, శివసేన(యూబీటీ), ఏఐఎంఐఎంతోసహా ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రతి మార్పును కమిటీ తిరస్కరించింది. ఈ నివేదికపై ప్రతిపక్ష సభ్యులు తమ డిస్సెంట్(అసమ్మతి) నోట్‌ను సమర్పించారు. గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఆధునికతను, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకురావడమని బీజేపీ సభ్యులు వాదించగా, ఇది ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా, వక్ఫ్ బోర్డుల నిర్వహణలో జోక్యంగా ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారు.