jio cricket

జియో క్రికెట్ డేటా ప్యాక్..ఆఫర్ మాములుగా లేదు

క్రికెట్ అభిమానుల కోసం జియో కొత్త క్రికెట్ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఛాంపియన్స్ ట్రోఫీ, IPL టోర్నమెంట్లను దృష్టిలో ఉంచుకుని జియో వినియోగదారులకు ప్రత్యేకమైన డేటా ప్లాన్‌ను ప్రకటించింది.

Advertisements
jio cricket data pack

క్రికెట్ స్పెషల్ ప్యాక్‌ ప్లాన్స్

ఈ క్రికెట్ స్పెషల్ ప్యాక్‌లో భాగంగా, రూ.195 చెల్లిస్తే 15GB హైస్పీడ్ డేటాతో పాటు, 90 రోజుల పాటు ‘Jio Hotstar’ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించనుంది. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంజాయ్ చేయడానికి ఈ ప్లాన్ అందరికీ ఉపయోగకరంగా మారనుంది. IPL, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి క్రికెట్ టోర్నమెంట్లు జియో హాట్‌స్టార్‌లో ప్రసారమవుతుండటంతో, ఈ ప్లాన్ తీసుకుంటే డేటా మరియు సబ్‌స్క్రిప్షన్ రెండూ లభించే అవకాశం ఉంది.

తక్కువ ధరలోనే అధిక డేటాతో పాటు స్ట్రీమింగ్

క్రికెట్ సీజన్‌ను మరింత ఆసక్తిగా వీక్షించాలనుకునే జియో వినియోగదారులకు ఈ ప్లాన్ హాట్‌ఫేవరేట్‌గా మారే అవకాశం ఉంది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా, తక్కువ ధరలోనే అధిక డేటాతో పాటు స్ట్రీమింగ్ సౌకర్యం లభించడంతో, ఇది మార్కెట్లో మంచి స్పందన పొందే అవకాశం ఉంది. క్రికెట్ లవర్స్ ఈ ఆఫర్‌ను మిస్ కాకుండా వీలైనంత త్వరగా సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related Posts
AnanthAmbani: కోళ్ల పై ఉన్న ప్రేమతో ఏకంగా కోళ్ల లారీనే కొనేసిన అనంత్‌ అంబానీ
Ananth Ambani: కోళ్ల పై ఉన్న ప్రేమతో ఏకంగా కోళ్ల లారీనే కొనేసిన అనంత్‌ అంబానీ

ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మూగజీవాలు, పక్షులపై తనకున్న ప్రేమాభిమానాలను మరోసారి చాటుకున్నారు. జామ్‌నగర్‌ నుంచి ద్వారకాకు పాదయాత్ర చేస్తున్న Read more

జనవరి 22న సామ్‌సంగ్ మొబైల్ ఏఐ ఆవిష్కరణ
Samsung unveils Mobile AI on January 22

హైదరాబాద్‌: మరింత సహజమైన మరియు ఆకర్షణీయమైన ఏఐ కోసం సిద్ధంగా ఉండండి. గెలాక్సీ ఏఐ యొక్క తదుపరి పరిణామం రాబోతోంది. మరియు ఇది మీరు ప్రతిరోజూ ప్రపంచంతో Read more

ఐఈఈఈ జీఆర్ఎస్ఎస్ ఎస్ వై డబ్ల్యు 2024 ను నిర్వహించిన కెఎల్‌హెచ్‌ అజీజ్ నగర్
KLH Aziz Nagar organized IEEE GRSS SYW 2024

న్యూఢిల్లీ : హైదరాబాదులోని కెఎల్‌హెచ్‌ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఐఈఈఈ జియోసైన్స్ మరియు రిమోట్ సెన్సింగ్ సొసైటీ (జీఆర్ఎస్ఎస్) స్టూడెంట్ , యంగ్ ప్రొఫెషనల్ మరియు Read more

రాష్ట్రపతి కి ఘన స్వాగతం
mangalagiri aims

అమరావతి : మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా Read more