हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్ సిబి

Anusha
IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్ సిబి

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా,పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 70 పరుగులు చేసింది.ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య 22, ప్రభ్ సిమ్రన్ సింగ్ 33 పరుగులు చేశారు. వీరిద్దరినీ కృనాల్ పాండ్యా పెవిలియన్ కు తిప్పి పంపాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 6 పరుగులు చేసి రొమారియో షెపర్డ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తెలిపాడు. పిచ్ చూడటానికి బాగుందన్నాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగా లియామ్ లివింగ్ స్టోన్‌ను తప్పించి రోమారియో షెఫెర్డ్‌ను తీసుకున్నామని తెలిపాడు.

లివింగ్ స్టోన్

ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ, ‘మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. వికెట్‌లో పెద్దగా మార్పు ఉండదు. సెకండ్ బ్యాటింగ్ చేస్తే వికెట్ గురించి, గేమ్ గురించి ఓ అవగాహన వస్తుంది. మేం వేదికలను చూడటం లేదు. మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం. లివింగ్ స్టోన్ స్థానంలో రోమారియో షెఫెర్డ్ జట్టులోకి వచ్చాడు.’అని రజత్ పటీదార్‌కు చెప్పుకొచ్చాడు.

లక్ష్యం

శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. ‘మేం కూడా బౌలింగ్ ఎంచుకోవాళ్లనుకున్నాం. ఏది ఏమైనా పరిస్థితులను అందిపుచ్చుకొని ఆడటం చాలా ముఖ్యం. కాస్త టైమ్ తీసుకొని బంతి ఎలా మూవ్ అవుతుందో గమనించి ఆడాలి. మేం ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. మేం బోర్డుపై మంచి లక్ష్యం నమోదు చేస్తామని ఆశిస్తున్నా. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న మద్దతు అద్భుతం. ముఖ్యంగా ఇక్కడ జరిగిన గత మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం.’అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

పంజాబ్ కింగ్స్ జట్టు

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (సి), జోష్ ఇంగ్లిస్ (w), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

ఆర్‌సీబీ జట్టు

ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్.

Read Also: Vaibhav Suryavanshi: వైభవ్​ సూర్యవంశీ పై ప్రశంసల వర్షం కురిపించిన సంజీవ్ గోయెంకా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870