हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఆర్‌సీబీ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది:సురేశ్ రైనా

Anusha
IPL 2025: ఆర్‌సీబీ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది:సురేశ్ రైనా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ లో భాగంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలుస్తుందని సురేశ్ రైనా జోస్యం చెప్పాడు. ఈ ఏడాది ఆర్‌సీబీ మెరుగైన ప్రదర్శన చేస్తుందని తెలిపాడు. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తుందని కొనియాడాడు. ఐపీఎల్ 2025 బ్రేక్ ఆర్‌సీబీ మూమెంటమ్‌ను దెబ్బతీయలేదన్నాడు. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ 2025 సీజన్ మరికొద్ది గంటల్లో తిరిగి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.బెంగళూరు వేదికగా కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య నేడు(శనివారం)జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 సీజన్ రీస్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ షో(Broadcaster Show)లో మాట్లాడిన సురేశ్ రైనా ఆర్‌సీబీకి టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. ఐపీఎల్ బ్రేక్ ఆర్‌సీబీ జైత్రయాత్రను అడ్డుకోలేదని అభిప్రాయపడ్డాడు.’ఈ సారి ఆర్‌సీబీకి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్‌సీబీ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది. చిన్నస్వామి మైదానంలో 150, 136 పరుగుల స్వల్ప లక్ష్యాలను కాపాడుకుంటుంది. ముఖ్యంగా వారి బౌలింగ్ విభాగం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్‌ను రెండు సార్లు ఓడించాడు. చెన్నై గడ్డపై గెలవడంతో పాటు సొంతగడ్డపై సీఎస్‌కేను ఆర్‌సీబీ ఓడించింది. ఈ ఫలితాలనే ఆర్‌సీబీ(RCB) బలాన్ని తెలియజేస్తున్నాయి. వారి డ్రెస్సింగ్ రూమ్ కూడా చాలా సానుకూలంగా ఉంది. ఇవే ఆ జట్టు టైటిల్‌కు చేరువైందనే సంకేతాలు ఇస్తున్నాయి. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ కూడా అదరగొడుతున్నాయి. కానీ ఈ ఏడాది విరాట్ కోహ్లీ 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరపడొచ్చు.’అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.

 IPL 2025: ఆర్‌సీబీ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది:సురేశ్ రైనా
IPL 2025: ఆర్‌సీబీ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది:సురేశ్ రైనా

బ్యాటింగ్

ఆరెంజ్ క్యాప్ జాబితాలో ఆటగాళ్ల మధ్య 10 పరుగుల వ్యత్యాసమే ఉందని, సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) అద్భుతంగా రాణిస్తున్నాడని రైనా కొనియాడాడు. ‘ఆరెంజ్ క్యాప్ జాబితాలోని ఆటగాళ్ల మధ్య 2, 8, 10 పరుగుల వ్యత్యాసం మాత్రమే ఉంది. సూర్యకుమార్ యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. అతను ఓపెనర్‌ కాకున్నా లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ జాబితాలో పోటీ పడుతున్నాడు. సూర్యను మూడో స్థానంలో ఆడించడం మొదలు పెట్టినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగం బలంగా మారింది. నెంబర్ 3 బ్యాటర్‌ మ్యాచ్‌లను ముగిస్తే ఆరెంజ్ క్యాప్ కాదు టైటిల్ కూడా దక్కుతుంది.’అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.

Read Also: Rohit Sharma: తన సోదరుడిపై రోహిత్ ఆగ్రహం ఎందుకంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870