हिन्दी | Epaper
జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

RBL Bank Shares: స్టాక్ మార్కెట్లో ఆర్బీఎల్ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Shobha Rani
RBL Bank Shares: స్టాక్ మార్కెట్లో ఆర్బీఎల్ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆర్బీఎల్ బ్యాంక్‌ (RBL Bank Shares) తాజాగా స్టాక్ మార్కెట్ వార్తల్లోకెక్కింది. ఈ కంపెనీలో దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎన్బీడీ సంస్థ మైనారిటీ స్టాక్ కొనుగోలు చేసేందుకు రెడీ అవుతోందంటూ బిజినెస్ సర్కిల్లో వార్తలు గుప్పుమన్నాయి.
మార్కెట్‌లో ఊహాజనిత పుకారు, షేర్లపై ప్రభావం
ఈ వార్తలు వైరల్ కావడంతో వెంటనే ఆర్‌బీఎల్ బ్యాంక్ స్పందించింది. జాతీయ ఛానల్ ఇచ్చిన ప్రకటనలో ఈ వార్తలు పూర్తిగా అబద్దమని అలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది. ఎమిరేట్స్ ఎన్బీడీతో డీల్ వార్తలు అబద్దం.. అది ఊహాజనితమైనదిగా పేర్కొంటూ..అలాంటిదేమైనా ఉంటే కంపెనీ అధికార ప్రకటన ద్వారా తెలియజేస్తుందని చెప్పుకొచ్చింది.

RBL Bank Shares: స్టాక్ మార్కెట్లో ఆర్బీఎల్ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ
స్టాక్ మార్కెట్లో ఆర్బీఎల్ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

RBL బ్యాంక్ ఖండన ప్రకటన
అయితే రూమర్స్ వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లో (RBL Bank Shares) షేర్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. అయితే కంపెనీ ప్రకటన తర్వాత మళ్లీ లాభాల బాట పట్టాయి. నిన్న 4 శాతం పైగా షేర్ల ధరలు పెరిగాయి. వరుసగా 4వ ట్రేడింగ్ రోజు కంపెనీ లాభాలతో ముగిసింది. జూన్ నెలలో ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు 21 శాతం లాభపడగా.. గత ఆరు నెలల్లో బ్యాంక్ షేర్లు 64 శాతం మేర పుంజుకున్నాయి. గత 5 రోజుల్లోనే 7 శాతం పుంజుకున్నాయి. మొత్తం ఎనిమిది సెషన్లలో ఆర్బీఎల్ బ్యాంకు షేర్లు ఏడు సార్లు లాభాల్లోనే ముగియడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.
RBI నియమాలు & పరిమితులు
ఎమిరేట్స్ ఎన్బీడీ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్‌లో (RBL Bank Shares) మైనారిటీ వాటా తీసుకునేందుకు చర్చల్లో ఉన్నట్టు పేర్కొంది. ఇది భారత బ్యాంకింగ్ రంగంలోకి ఆ సంస్థ ప్రవేశానికి పునాది అవుతుందని చెప్పుకొచ్చింది. ఇక భారత బ్యాంకుల్లో విదేశీ సంస్థలకు 15% కంటే ఎక్కువ వాటా ఉండడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతించదనే విషయం విదితమే. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులు ఇస్తుంది. అయితే ఆర్బీఎల్ బ్యాంక్ చేసిన ప్రకటనతో అదంతా పుకారేనని తేలిపోయింది.

RBL Bank Shares: స్టాక్ మార్కెట్లో ఆర్బీఎల్ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

భారత బ్యాంకింగ్ రంగంపై విదేశీ సంస్థల ఆసక్తి
ఈ మధ్య కాలంలో పలు విదేశీ కంపెనీలు భారత బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాయి. సీబీఎస్ బ్యాంక్‌లో ఫెయిర్‌ఫ్యాక్స్ కంపెనీ అధిక వాటాను కొనుగోలు చేసింది. అలాగే డీబీఎస్ బ్యాంక్ లక్ష్మీ విలాస్ బ్యాంకుతో విలీనానికి అనుమతిచ్చింది. జపాన్‌కు చెందిన ఎసెంబిఎస్ సంస్థ ఎస్ బ్యాంకు లో 20% స్టేక్ కొనుగోలు చేయడానికి ఆర్బీఐ అనుమతి కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమిరేట్స్ ఎన్బీడీ కూడా భారత్ లో ఎంట్రీకి ఆశలు పెట్టుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కంపెనీ ప్రకటనతో అతి అబద్దమేనని తేలిపోయింది.

Read Also: Stock market: మిశ్రమ సంకేతాలతో మార్కెట్ల మారుదిశ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870