మీరు యుపిఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా అయితే ఈ వార్త మీ కోసమే. డిజిటల్ పేమెంట్స్ మరింత సులభం ఇంకా ఉపయోగకరంగా మార్చేందుకు యుపిఐ ట్రాన్సక్షన్స్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వ్యాపారులకు, సాధారణ కస్టమర్లకు ఇద్దరికీ కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
ఆర్‌బిఐ కొత్త ఆదేశం ఏంటి
బ్యాంకులతో సంప్రదించిన తర్వాత పర్సన్ టు మర్చంట్ (P2M అండ్ M2M), మర్చంట్ టు మర్చంట్ ట్రాన్సక్షన్స్ లిమిట్ పెంచడానికి లేదా తగ్గించడానికి RBI ఇప్పుడు NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇచ్చింది. ఇప్పటివరకు ఈ రెండు రకాల ట్రాన్సక్షన్స్ లిమిట్ రూ.1 లక్ష ఉండేది, కానీ ఇప్పుడు దానిని రూ.2 లక్షల వరకు లేదా రూ.5 లక్షల వరకు పెంచవచ్చు.
సామాన్యులకు ఉన్న రూల్ ఏంటి ?
సాధారణ ప్రజలకి అంటే పర్సన్-టు-పర్సన్ (P2P) ట్రాన్సక్షన్స్ లిమిటీలో ఎటువంటి మార్పు లేదని RBI స్పష్టం చేసింది. అంటే ఇప్పుడు UPI ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి గరిష్టంగా రూ.1 లక్ష వరకు పంపవచ్చు. UPI లిమిట్ ప్రస్తుత స్టేటస్ : P2P అంటే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి 1 లక్ష, అలాగే P2M అంటే ఒక వ్యక్తి నుండి వ్యాపారికి 1 లక్ష (ప్రస్తుతం), M2M (వ్యాపారి నుండి మరొక వ్యాపారికి) రూ.1 లక్ష (ప్రస్తుతం) బిజినెస్ క్లాస్ కు అతిపెద్ద ప్రయోజనం: ఈ మార్పు వల్ల వ్యాపారులు అతిపెద్ద ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారులు ఎటువంటి అడ్డంకులు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్సక్షన్ చేయవచ్చు. ఈ బెనిఫిట్ ముఖ్యంగా ఆన్‌లైన్ వ్యాపారాలు, జ్యువెలరీ షాపులు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లు ఇంకా ఇతర పెద్ద వ్యాపారాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతం
ఈ చర్య భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఎక్కువ మంది క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్స్ ఇష్టపడుతున్నారు, దీని వల్ల పారదర్శకత పెంచుతుంది ఇంకా పేమెంట్ సిస్టం బలోపేతం చేస్తుంది. బ్యాంకులకు కొత్త బాధ్యత : ట్రాన్సక్షన్స్ లిమిట్ ఇప్పుడు పెరిగే ఛాన్స్ ఉండటంతో బ్యాంకులు వాటి టెక్నీకల్ సెక్యూరిటీ ఇంకా స్ట్రాంగ్ సిస్టం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది, ఎందుకంటే దీని ద్వారా మోసాలను నివారించవచ్చు. NPCIకి కీలక బాధ్యత : ఇప్పుడు NPCI మార్కెట్ డిమాండ్ ప్రకారం ఇంకా బ్యాంకులతో చర్చించడం ద్వారా UPI ట్రాన్సక్షన్ లిమిట్ మార్చే అధికారాన్ని పొందింది.

RBI: లక్ష నుండి 2 లక్షల వరకు ఆర్బీఐ అనుమతి
Advertisements
Advertisements