ర‌ష్మిక, విజ‌య్‌ రిలేషన్‌పై హాల్‌చ‌ల్ చేస్తున్న ఒమన్ ఫోటోలు

Rashmika Mandanna: ర‌ష్మిక, విజ‌య్‌ రిలేషన్ పై హాల్ చల్ చేస్తున్న ఫోటోలు

నేషనల్ క్రష్‌గా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న ఏప్రిల్ 5న తన 29వ పుట్టినరోజును విదేశాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈసారి ఆమె సెలబ్రేషన్ స్పాట్ ఒమన్. అక్కడ దిగిన ఫొటోలు ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ అయిన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా, అభిమానుల్లో ఉత్సాహంతో పాటు అనేక ప్రశ్నలు కూడా తలెత్తాయి.

Advertisements

రష్మిక ఫొటోలను చూసిన తర్వాత నెటిజ‌న్లు అధికంగా వేసిన కామెంట్ ఒక్కటే – విజయ్ దేవరకొండ ఎక్కడ? గతంలోనూ వీరిద్దరి మధ్య ప్రేమ ఉందన్న పుకార్లు ఊపందుకున్న నేపథ్యంలో, ఇలా రష్మిక ఒంటరిగా విదేశీ టూర్ చేస్తే అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. రష్మిక పుట్టిన రోజు ముగిసిన రెండు రోజుల తరువాత విజయ్ దేవరకొండ కూడా ఫొటోలు షేర్ చేశారు. ప్రత్యేకంగా సముద్ర తీరంలో గుర్రపు స్వారీ, ఒంటరిగా నడుస్తున్న ఫోటోలు పోస్ట్ చేశారు. అయితే ఆ ఫోటోల బ్యాక్‌డ్రాప్, రష్మిక ఫొటోలలో కనిపించిన ప్రదేశంతో హొచ్చుతొచ్చి పోవడంతో – నెటిజన్లు ఇద్దరూ కలిసే ఒమన్‌లో ఉన్నారే! అంటూ ఫిక్స్ అయ్యారు.ఇది కూడా ఆసక్తికరమే – విజయ్ దేవరకొండ రష్మిక కంటే ఒకరోజు ముందే ముంబై నుండి బయలుదేరారు. ఆ తర్వాతి రోజు రష్మిక వెళ్లింది. వాళ్లు కలిసీ వెళ్లలేదు. కానీ ఇద్దరూ ఒకే గమ్యస్థానానికి వెళ్లారని స్పష్టమవుతుంది. ఇది మరోసారి వారి మధ్య సాన్నిహిత్యాన్ని బలంగా చూపిస్తోంది. ఇప్పటివరకు రష్మిక గానీ, విజయ్ దేవరకొండ గానీ తమ ప్రేమను బహిరంగంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియా పోస్టులు, ఫొటోల బ్యాక్‌డ్రాప్స్, వారి టూర్ టైమింగ్ చూసి అభిమానులు మాత్రం వారి బంధాన్ని ధృవీకరించినట్టుగా భావిస్తున్నారు.

ఇంటర్వ్యూలో రష్మిక

ఇటీవలి కాలంలో ‘వీ ఆర్ యువా’ అనే ప్లాట్‌ఫారమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక, విజయ్ దేవరకొండపై తన అనుబంధాన్ని గురించి ఓపిగ్గా వెల్లడించారు. ఆమె చెప్పిన ముఖ్యమైన మాటలు నేను, విజయ్ కలిసి పెరిగాం. కాబట్టి ప్రస్తుతం నా జీవితంలో నేను చేసే ప్రతి పనిలో ఆయన సహకారం ఉంది. నేను చేసే ఏ పనిలోనైనా ఆయన సలహా తీసుకుంటాను. నాకు ఆయన అభిప్రాయం అవసరం. ఆయన అంత త్వ‌ర‌గా సరే అనే వ్యక్తి కాదు. ఇది మంచిది ఇది మంచిది కాదు నేను అనుకునేది ఇదే ఇలా విష‌యం ఏదైనా ఆయన క‌చ్చితంగా చెబుతాడు. ఆయన నా మొత్తం జీవితంలో అందరికంటే వ్యక్తిగతంగా నాకు ఎక్కువగా మద్దతు ఇచ్చాడు.ఆయన అందరికంటే ఎక్కువ మద్దతిచ్చిన వ్యక్తి. ఈ వ్యాఖ్యలు రష్మిక తన మనసులో విజయ్ దేవరకొండకు ఉన్న స్థానం ఎంత ప్రాముఖ్యతతో ఉందో సూచిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇద్దరు స్పష్టంగా ఏమి చెప్పకపోయినా, ఫ్యాన్స్ మాత్రం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. తమ అభిమాన సెలబ్రిటీలు కలిసి ఉన్నారన్న అనుభూతి వారికి ప్రత్యేక ఆనందాన్ని ఇస్తోంది.

Read also: Pushpa 2: టీవీలో పుష్ప 2..ఎప్పుడంటే?

Related Posts
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ నేడు కోర్టు విచారణ.
Allu Arjun

హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ అభిమానులకు ఆందోళన కలిగించింది.ఈ ఘటనలో ఓ మహిళ దురదృష్టవశాత్తు ప్రాణాలు Read more

వీఐ “సూపర్‌హీరో” పథకం
VI launched the “Superhero” scheme

పరిశ్రమలో మొదటిసారిగా “సూపర్‌హీరో” పథకాన్ని ప్రముఖ టెలికాం ఆపరేటర్ Vi తీసుకువచ్చింది. ఇది 12 AM నుండి 12 PM మధ్య అపరిమిత డేటాను వినియోగించుకునే అవకాశం Read more

ఎంఐసీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 2025 బడ్జెట్ లక్ష్యాలు
MIC Electronics Ltd. has put forward budget targets for the year 2025

హైదరాబాద్ : LED డిస్ప్లే మరియు లైటింగ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉన్న MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (MICEL), రాబోయే కేంద్ర బడ్జెట్ 2025 పురస్కరించుకుని తమ అంచనాలను Read more

ఏపీలో ఈనెల 3 నుంచి దసరా సెలవులు!
school holidays in august

Dussehra holidays in AP from 3rd of this month! అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో దసరా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×