हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: కేకేఆర్ తో జరుగుతోన్న మ్యాచులో అదరగొడుతున్నపంజాబ్ కింగ్స్ బ్యాటర్లు

Anusha
IPL 2025: కేకేఆర్ తో జరుగుతోన్న మ్యాచులో అదరగొడుతున్నపంజాబ్ కింగ్స్ బ్యాటర్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  2025లో భాగంగా తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తో జరుగుతోన్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అదరగొట్టారు. మిగతా బ్యాట్లర్లు ఇంకాస్త బాగా ఆడి ఉండాల్సింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ ఫినిషింగ్ అంతగా బాలేదు. ఇంకాస్త మంచిగా ఆడి ఉంటే 220 వరకు స్కోరు వెళ్లేది.ఈ మ్యాచులో మొదటగా టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే కేకేఆర్ బౌలర్లకు పంజాబ్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 69 పరుగులు), ప్రభ్ సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 83 రన్స్) అటాకింగ్ షాట్లు ఆడుతూ మంచి శుభారంభం అందించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్ కు 120 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

బౌల‌ర్ల‌

ముల్ల‌నూర్‌లో కోల్‌క‌తా బౌల‌ర్ల ధాటికి 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన పంజాబ్ కింగ్స్ ఈసారి భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచిన పంజాబ్‌కు ఓపెన‌ర్లు శుభారంభం ఇచ్చారు. వైభ‌వ్ అరోరా వేసిన‌ తొలి బంతికే ప్రియాన్ష్ ఆర్య‌(69) బౌండ‌రీ రాబ‌ట్టాడు. ఔట్ సైడ్ ప‌డిన‌ చివ‌రి బంతిని ఫోర్‌గా మ‌లిచాడు. స‌కారియా రెండో ఓవ‌ర్లో రెచ్చిపోయిన ప్రియాన్ష్‌, ప్ర‌భ్‌సిమ్ర‌న్‌(83)లు బౌండ‌రీల‌తో చెల‌రేగారు. 18 ప‌రుగులు పిండుకున్నారు. ఆ త‌ర్వాత కూడా ఈ జోడీ కోల్‌క‌తా బౌల‌ర్ల‌ను ఉతికేశారు. హ‌ర్షిత్ రానా వేసిన 5వ ఓవ‌ర్లో సిక్స‌ర్ బాదిన ప్ర‌భ్‌సిమ్ర‌న్ స్కోర్ 50 దాటించాడు. వీళ్లిద్ద‌రూ ధ‌నాధ‌న్ ఆడ‌డంతో అయ్య‌ర్ సేన ప‌వ‌ర్ ప్లేలో 56 ర‌న్స్ కొట్టింది.

పెవిలియన్

ఈ ఇద్దరూ 197, 169 స్ట్రైక్ రేటుతో విరుచుకుపడ్డారు. గ్యాప్ లేకుండా బౌండరీలు బాదారు. అయితే వీరిద్దరిని ఆండ్రూ రస్సెల్ విడగొట్టాడు. ప్రియాంశ్ ఆర్యను పెవిలియన్ పంపాడు. అలానే సెంచరీకు దగ్గరగా వచ్చిన ప్రభ్‌సిమ్రన్‌ను వైభవ్ అరోరా ఔట్ చేశాడు.ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్ వెల్ (7) మళ్లీ నిరాశపరిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్), మార్కో జాన్సన్ (3), జోస్ ఇంగ్లీష్ (11) పరుగులు చేశారు.కేకేఆర్ డెత్ ఓవర్లు బాగా వేసింది. లాస్ట్ రెండు ఓవర్లు యండ్రూ రసెల్ మంచిగా వేశాడు. తక్కువ పరుగులే ఇచ్చాడు. వైభవ్ అరోరా 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, యాండ్రూ రసెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

Read Also: Pbks: రికీ పాంటింగ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి ఆగ్రహం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870