విద్యార్థినులను వేధించిన ప్రొఫెసర్‌.. వీడియోలు లీక్‌తో సస్పెండ్‌

UP Professor : విద్యార్థినులను వేధించిన ప్రొఫెసర్‌.. వీడియోలు లీక్‌తో సస్పెండ్‌

కాలేజీ ప్రొఫెసర్‌ పలువురు మహిళా స్టూడెంట్స్‌ను లైంగికంగా వేధించాడు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక బాధిత మహిళ పోలీసులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ ప్రొఫెసర్‌ వికృత చేష్టలకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను పంపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాలేజీ యాజమాన్యం కూడా ఆ ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హత్రాస్‌లోని సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కాలేజీలోని భౌగోళిక విభాగం ప్రొఫెసర్ రజనీష్ కుమార్‌ పలువురు మహిళా విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Advertisements


ప్రొఫెసర్ రజనీష్‌పై పోలీసులకు ఫిర్యాదు
కాగా, మార్చి 13న ప్రొఫెసర్ రజనీష్‌పై పోలీసులకు ఒక అనామక ఫిర్యాదు అందింది. లేడీ స్టూడెంట్స్‌తో ఆ ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు వీడియోలు రికార్డ్‌ చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. ‘మోదీ ప్రభుత్వం ‘బేటీ బచావో బేటీ పఢావో’కు మద్దతు ఇస్తుంది. కానీ, ఆ తర్వాత కూడా ఇలాంటి వ్యక్తులు కుమార్తెలపై క్రూరత్వానికి పాల్పడుతున్నారు.

ఈ క్రూరమైన వ్యక్తి నన్ను చాలా బాధపెడుతున్నాడు. కొన్నిసార్లు నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. దయచేసి విద్యార్థినులను రక్షించండి. అవమానం కారణంగా ఏ విద్యార్థిని బహిరంగంగా ఫిర్యాదు చేయలేదు. కాబట్టి, దయచేసి ఈ రాక్షసుడిపై కఠిన చర్యలు తీసుకోండి. నాలాంటి చాలా మంది అమ్మాయిలకు న్యాయం చేయండి’ అని ఆ లేఖలో వేడుకున్నది.
సోషల్‌ మీడియాలో వైరల్‌
మరోవైపు ఆ ప్రొఫెసర్ గత ఏడాదిన్నరగా విద్యార్థినులపై ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధిత మహిళ ఆరోపించింది. మహిళా కమిషన్, ఇతర సీనియర్ అధికారులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించింది. ప్రొఫెసర్ అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్న ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను పోలీసులకు పంపింది.

Related Posts
Tariffs : వివిధ దేశాలపై ప్ర‌తీకార సుంకాల‌ను ప్ర‌క‌టించిన డొనాల్డ్‌ ట్రంప్
అమెరికాకు ఐఫోన్ల ఎగుమతి:టారిఫ్ ల నుంచి తప్పించుకోవడానికి చర్యలు

Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. భారత్‌ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను అమలులోకి తీసుకొచ్చారు. ఏప్రిల్ Read more

భారత్ ఎక్కడ ఆడినా గెలుస్తుంది: వసీం అక్రమ్
భారత్ ఎక్కడైనా గెలుస్తుంది ! వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు

భారత జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్‌లో ఆడి గెలవడం క్రికెట్ ప్రపంచంలో ప్రధాన చర్చనీయాంశమైంది. భారతదేశం పాకిస్తాన్‌లో ఆడకపోవడం కొందరికి లాభదాయకంగా అనిపించగా, మరికొందరు ఇది Read more

Gas Cylinder: వినియోగదారులకు షాక్..భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల రేట్లు
వినియోగదారులకు షాక్..భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల రేట్లు

కేంద్ర ప్రభుత్వం గృహావసరాల వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తాజాగా గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా పెంచినట్టు ప్రకటించింది. ఒక్కో Read more

CM Stalin: వివాదాస్పదంగా మారిన సీఎం స్టాలిన్ పోస్ట్
CM Stalin: వివాదాస్పదంగా మారిన సీఎం స్టాలిన్ పోస్ట్

కన్నడ ప్రజల ఆగ్రహానికి కారణం ఏమిటి? తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా తెలుగు, కన్నడ ప్రజలకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×