AP HighCourt: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కేవలం రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసినట్లు కాకాణి తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. అయితే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పలువురిని బెదిరించారని పోలీసుల తరఫు న్యాయవాది వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

ప్రస్తుతం పరారీలోనే గోవర్ధన్‌రెడ్డి
వైసీపీ ప్రభుత్వ హయాంలో పొదలకూరు మండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా క్వార్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లను కూడా కేసులో జోడించారు. ప్రస్తుతం గోవర్ధన్‌రెడ్డి పరారీలోనే ఉన్నారు. అతడి ఆచూకీ కోసం హైదరాబాద్‌లో నెల్లూరు పోలీసులు వెతుకుతున్నారు.
కాకాణి ఇప్పుడు మరింత చిక్కుల్లో కూరుకుపోయారు.
కాగా, అక్రమ మైనింగ్ కేసులో వరుసగా రెండు సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి ఇప్పుడు మరింత చిక్కుల్లో కూరుకుపోయారు. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు మంగళవారం (ఏప్రిల్ 1) కొట్టివేసింది.