Prime Minister Modi is going to visit America.

అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ..!

వాషింగ్ట‌న్‌: ప్ర‌ధాని మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్న సమాచారం. ఫిబ్ర‌వ‌రిలో మోడీ వైట్‌హౌజ్‌ను విజిట్ చేయ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశాధ్య‌క్షుడిగా రెండో సారి ఎన్నికైన ట్రంప్‌తో.. సోమ‌వారం ప్ర‌ధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఆ ఫోన్ సంభాష‌ణ గురించి ట్రంప్ వెల్ల‌డించారు. ఫ్లోరిడాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానంలో వెళ్తున్న స‌మ‌యంలో ట్రంప్ రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడారు. భార‌త ప్ర‌ధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడ‌న‌ని, ఆయ‌న వైట్‌హౌజ్‌కు రానున్నార‌ని, బ‌హుశా ఫిబ్ర‌వ‌రిలో ఆయ‌న శ్వేత‌సౌధాన్ని విజిట్ చేసే ఛాన్సు ఉన్న‌ట్లు తెలిపారు. ఇండియాతో త‌మ‌కు మంచి రిలేష‌న్ ఉంద‌ని ట్రంప్ పేర్కొన్నారు.

Advertisements
image

ప్రధాని మోడీతో ఫోన్‌లో అన్ని అంశాల గురించి చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. తొలి సారి దేశాధ్య‌క్షుడిగా చేసిన స‌మ‌యంలో.. ట్రంప్ త‌న చివ‌రి ప‌ర్య‌ట‌న ఇండియాకే వ‌చ్చారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్య మంచి రిలేష‌న్ ఉన్న‌ది. 2019లో హూస్ట‌న్‌లో జ‌రిగిన ర్యాలీలో.. 2020 ఫిబ్ర‌వ‌రిలో అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ర్యాలీలో ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

కాగా, ట్రంప్‌- మోడీ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించిన సందర్భంగా గతంలో ఆయనకు ప్రధాని మోడీ ఫోన్‌ కాల్‌లో అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.

Related Posts
Dating App Scam : తోడు కోసం మోజు పడితే 6.5 కోట్లు తోడేసారు
Dating App Scam తోడు కోసం మోజు పడితే 6.5 కోట్లు తోడేసారు

Dating App Scam : తోడు కోసం మోజు పడితే 6.5 కోట్లు తోడేసారు ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి డేటింగ్ యాప్ మోసానికి Read more

రష్యా సైబర్ దాడుల ద్వారా ఉక్రెయిన్ కు మద్దతును తగ్గించాలనుకుంటున్నది: పాట్ మెక్‌ఫాడెన్
McFadden

రష్యా, యుకె మరియు ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపే ఇతర మిత్రదేశాలపై సైబర్ దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని, ఈ విషయంలో ఒక ఉన్నత స్థాయి మంత్రి హెచ్చరికలు Read more

RCB: ఐపీఎల్ మ్యాచ్ లో వివాదానికి తెరతీసిన ఆర్సీబీ
RCB: ఐపీఎల్ మ్యాచ్ లో వివాదానికి తెరతీసిన ఆర్సీబీ

ఐపీఎల్‌కు ముందే ఆర్సీబీ వివాదంలో ఐపీఎల్ ప్రారంభానికి ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అనవసరమైన వివాదంలో చిక్కుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ మార్పును ఎగతాళి Read more

Subramanya Swamy: తిరుమలలో ఆవుల మృతిపై సుబ్రహ్మణ్యస్వామి ఫైర్
Subramanya Swamy: తిరుమలలో ఆవుల మృతిపై సుబ్రహ్మణ్యస్వామి ఫైర్

తిరుమల గోశాలలో గోవుల మృతి వ్యవహారంపై రాజకీయ దుమారం తిరుమల గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ Read more

Advertisements
×