sriharikota

శ్రీహరికోట నుంచి వందో ప్రయోగానికి కౌంట్‌డౌన్

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో గల సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) వందో ప్రయోగానికి సిద్ధమైంది.2024 సంవత్సరాన్ని ఒక విజయవంతంమైన మిషన్‌తో పూర్తి చేసిన ఇస్రో.. 2025 కొత్త ఏడాదిని కూడా మరో మైలురాయితో ప్రారంభించబోతోంది. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి వందో ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు చేపట్టనున్న GSLV-F15 రాకెట్‌ ప్రయోగం షార్ నుంచి చేసే వందో ప్రయోగమని ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.

సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి 1979 ఆగస్ట్ 10న SLV 3E -1 రాకెట్ ద్వారా రోహిణి టెక్నాలజీ పేలోడ్‌ని ప్రయోగించింది. కానీ ఈ ప్రయోగం సఫలం కాలేదు. అయితే, ఆ తర్వాత జరిపిన రెండు ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. షార్ నుంచి ఇస్రో జరిపిన 99 ప్రయోగాల్లో 9 మాత్రమే విఫలమయ్యాయి. విజయవంతమైన ప్రయోగాల్లో 129 స్వదేశీ ఉపగ్రహాలను, 433 విదేశీ ఉప గ్రహాలను, రెండు ప్రైవేట్ ఉపగ్రహాలను, ఒక గగనయాన్ టెస్ట్ వెహికిల్ డీ వన్, 18 స్టూడెంట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.
శత ప్రయోగాల షార్
2024 డిసెంబర్ చివరి వారంలో, స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా ప్రయోగించిన PSLV C- 60 ప్రయోగ సమయంలో ఇది షార్ నుంచి చేసిన 99వ ప్రయోగమని అప్పటి ఇస్రో చైర్మన్‌ సోమనాథ్ తెలిపారు. ఈ ప్రయోగంలోనే ఇస్రో అంతరిక్షంలో రెండు శాటిలైట్లను డాకింగ్ చేసి, డాకింగ్ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది.శాటిలైట్ డాకింగ్ ద్వారా 2025ను కూడా సక్సెస్ ఫుల్‌గా ప్రారంభించిన ఇస్రో ఈ ఏడాది మొదటి నెలలోనే శ్రీహరికోట నుంచి వందో ప్రయోగానికి సిద్ధమైంది.

Related Posts
అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన..స్పందించిన హోంమంత్రి అనిత
Home Minister Anitha Says Focused on Women Security in AP

అమరావతి : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జ‌రిగిన‌ అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ కేసులో టెక్నాలజీని ఉపయోగించి నిందితులను 48 Read more

మహారాష్ట్ర PCC చీఫ్ నానా పటోలే రాజీనామా: కాంగ్రెస్‌లో కొత్త సంక్షోభం
nana patole

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే Read more

Delhi Election Results : కేజ్రీవాల్‌ పరాజయం..
Delhi Election Results.. Kejriwal defeat

Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు షాక్‌ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. Read more

పోసాని పై CID కేసు నమోదు
posani

తెలుగు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదైంది. చంద్రబాబును కించపరిచేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోసాని మాట్లాడారని టీడీపీ నేత బండారు వంశీకృష్ణ ఫిర్యాదుతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *