మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయగా రాష్ట్రపతి పాలన విధించారు.తాజా గా నిర్ణయం తీసుకున్నారు. గత రెండు ఏళ్లుగా కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణతో తీవ్ర హింసాత్మక పరిస్థితులు నెలకొన్న మణిపూర్‌లో పరిస్థితులు ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో చివరికి సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. బీరెన్ సింగ్ రాజీనామాతో మణిపూర్ ముఖ్యమంత్రి పదవిని ఎవరికైనా ఇస్తారా లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా అనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఘటనలో 100 మందికిపైగా చనిపోగా లక్ష మందికిపైగా కట్టుబట్టలతో ఊర్లు విడిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.కుకీ, మెయితీల మధ్య జరుగుతున్న హింసను అడ్డుకోవడంలో మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం విఫలం అయిందని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి.
ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మణిపూర్ పరిస్థితులను నియంత్రించలేకపోయిందని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ముఖ్యమంత్రి పదవి నుంచి బీరెన్ సింగ్ తప్పుకున్నారు. దీంతో తాజాగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
రాష్ట్రపతి పాలన విధించిన కొద్దిసేపటికే
అల్లర్లను అదుపు చేసేందుకు వెళ్లిన ఓ జవాన్ అలజడి సృష్టించాడు. తన తోటి సైనికులపైనే కాల్పులు జరిపి ,అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు సైనికులు చనిపోగా,మరో 8 మంది సైనికులు గాయపడ్డారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. సీఆర్పీఎఫ్ జవాన్ ఎందుకు కాల్పులు జరిపాడు అనేది ఇంకా తెలియలేదు. ఇక మణిపూర్‌లో ఇటీవల సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయగా,కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులు వెలువడిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం.మణిపూర్ ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని జిల్లాలోని లాంఫెల్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంప్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
120వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన సంజయ్ కుమార్ అనే జవాన్ , తనతోపాటు విధులు నిర్వర్తిస్తున్న సైనికులపై భీకర కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్‌ఐ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

రెండేళ్లుగా మణిపూర్‌లో ఉద్రిక్తతలు
2023 మే నెల నుంచి కుకీ, మెయితీ తెగల మధ్య తీవ్ర హింస చోటుచేసుకుంది. ఆర్థిక, సామాజిక వివక్ష, భూసమస్యల నేపథ్యంలో ప్రారంభమైన వివాదాలు క్రమంగా ఉగ్రరూపం దాల్చాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. లక్ష మందికిపైగా ప్రజలు సొంతూళ్లను వదిలి సహాయ కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
మణిపూర్‌లో పరిస్థితి మారటంతో, సీఎం బీరెన్ సింగ్‌పై సొంతపార్టీ నుంచి కూడా ఒత్తిళ్లు పెరిగాయి. చివరకు ఇటీవల ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో కొత్త సీఎంను నియమిస్తారా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? అన్న చర్చకు తెరపడింది. కేంద్ర ప్రభుత్వం బీరు రాజీనామా తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది.