పోసానిపై పలు స్టేషన్లలో 30 కి పైగా ఫిర్యాదులు

పోసాని కృష్ణ మురళి అరెస్ట్

తెలుగు సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్‌లో అరెస్ట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన పోసాని, టీడీపీ, జనసేన నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆయనపై ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisements
posani arrest4

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టు

పోసాని అరెస్ట్ వార్త బయటకు రాగానే ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఏపీ పోలీసులు వైఖరి అన్యాయమని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టు చేశారని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో 352(2) 111 R/W (3)5 బీఎన్ఎస్ యాక్ట్ 2023 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగానే రాయచోటి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు.

పోసాని భవిష్యత్ ప్రస్థానం

ఇక, గతంలో పోసాని రాజకీయాలకు ఆసక్తి చూపించినప్పటికీ, గత ఎన్నికల అనంతరం పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జరిగిన అరెస్టు నేపథ్యంలో, పోసాని భవిష్యత్ ప్రస్థానం ఎలా ఉండబోతుందన్న దానిపై చర్చలు మొదలయ్యాయి. టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పలువురిపై విచారణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోసాని అరెస్టు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.

Related Posts
Liquor Scam Case : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ
midhunreddy

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ స్కాం కేసులో పెద్ద షాక్ తగిలింది. ఈ కేసుకు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు Read more

మన్మోహన్‌ సింగ్‌ ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు : జో బైడెన్‌
Joe Biden mourns the death of Manmohan Singh

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ‘నిజమైన రాజనీతిజ్ఞుడు’, ‘గొప్ప ప్రజా Read more

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
TTD Tickets

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త . ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది. Read more

సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
pawan tirumala laddu

AP Govt suspends SIT investigation అమరావతి: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై Read more

×