हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

PNB MD Ashok Chandra: రిటెయిల్‌ రుణాలపై పీఎన్‌బీ ఫోకస్!

Shobha Rani
PNB MD Ashok Chandra: రిటెయిల్‌ రుణాలపై పీఎన్‌బీ ఫోకస్!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO అశోక్ చంద్ర (Ashok Chandra) తాజా సమావేశంలో బ్యాంక్ వ్యాపార వ్యూహాలను స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా రిటెయిల్, వ్యవసాయం మరియు MSME రుణాలపై బ్యాంక్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) (Rbi) రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో.. మూడో త్రైమాసికం నుంచి నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఎం)లో వృద్ధి కనిపించే అవకాశం ఉందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) (PNB) మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ అశోక్‌ చంద్ర (Ashok Chandra) అన్నారు. వడ్డీ ఆదాయానికి సంబంధించి స్థిరతను లక్ష్యంగా పెట్టుకున్నారు. నిధుల సమీకరణ ఖర్చు తగ్గే అవకాశం ఉన్నందున డిపాజిట్ రేట్లపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
RBI వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ అశోక్‌ చంద్ర (Ashok Chandra) సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవలి సమీక్షలో సీఆర్‌ఆర్‌లో ఆర్‌బీఐ కోత విధించడం వల్ల తమ బ్యాంకుకు రూ.15,000 కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయని, వీటిని రుణాలకు మళ్లించడం ద్వారా బ్యాంకుకు వడ్డీ ఆదాయం పెరుగుతుందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 2.93 శాతంగా ఉందని, 2025-26లోనూ ఇది 2.9 శాతంగా ఉండొచ్చన్నారు. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల, నిధుల సమీకరణ వ్యయాలూ దిగి వస్తాయని.. డిపాజిట్‌ రేట్లపై తాము త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

PNB MD Ashok Chandra: రిటెయిల్‌ రుణాలపై పీఎన్‌బీ ఫోకస్!
PNB MD Ashok Chandra: రిటెయిల్‌ రుణాలపై పీఎన్‌బీ ఫోకస్!

వడ్డీ ఆదాయం (NIM) టార్గెట్లు
రిటెయిల్, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈల రుణాలపై దృష్టి సారిస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 10-12% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. మొత్తం రుణాల్లో ఇవి 58 శాతానికి చేరుతాయని అంచనా వేశారు. బ్యాంకు నిరర్థక ఆస్తులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్‌ రుణాల వృద్ధిపైనా ఆశాభావంతోనే ఉన్నట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.35 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలు ఇచ్చామన్నారు. ముఖ్యంగా రెన్యూవబుల్‌ ఎనర్జీ, విద్యుత్తు, స్టీల్, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అప్పులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈల కోసం రూ.25 లక్షల వరకూ రుణాలను డిజిటల్‌ పద్ధతిలో సులభంగా జారీ చేస్తున్నామని తెలిపారు. PNB యొక్క వ్యూహం స్పష్టంగా గ్రాస్ క్రెడిట్ గ్రోత్, వడ్డీ ఆదాయ పెరుగుదల, కార్పొరేట్ మరియు MSME వృద్ధి పై దృష్టిని చూపుతోంది. అశోక్ చంద్ర నేతృత్వంలో బ్యాంక్ లాభదాయకత పెంచే మార్గాల్లో అడుగులు వేస్తోంది.

Read Also: Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870