హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశమైన మారిషస్‌తో భారతదేశానికి సన్నిహిత మరియు దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక సంబంధాలకు కారణం, 1.2 మిలియన్ల (12 లక్షలు) ద్వీప దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది భారత సంతతికి చెందినవారు కావడం.నరేంద్ర మోదీ మార్చి 11న మారిషస్‌కు చేరుకున్నారు. మారిషస్ చేరుకున్న వెంటనే ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ఆయన మార్చి 12న జరిగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. భారత రక్షణ దళాల బృందంతో పాటు భారత నౌక కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ భారత్ – మారిషస్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అనేక ఒప్పందాలపై సంతకం చేయనున్నారు.
మారిషస్‌లో మోదీకి ఘన స్వాగతం
మారిషస్‌లో ప్రధాన మంత్రి మోదీకి ఘన స్వాగతం లభించింది. మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులం ఆయనకు పూలమాల వేసి స్వాగతం పలికారు. మారిషస్ ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ప్రముఖ రాజకీయ నేతలు, మత పెద్దలు, దౌత్యవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరై భారత ప్రధానికి గౌరవం అందించారు.
ప్రవాస భారతీయుల ఆనందం
మారిషస్‌లోని ప్రవాస భారతీయులు ప్రధానమంత్రి రాకను ఘనంగా స్వాగతించారు. పోర్ట్ లూయిస్‌లో పెద్ద ఎత్తున భారతీయులు చేరి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. భారత ప్రవాసీయులు భారతదేశం – మారిషస్ సంబంధాలు మరింత బలపడతాయని నమ్మకంతో ఉన్నారు.
సోషల్ మీడియా
ప్రధాని మోదీ తన సోషల్ మీడియా వేదికగా మారిషస్ చేరుకున్న విషయాన్ని పంచుకున్నారు. మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలంగా చేసేందుకు సహాయపడుతుందని ప్రధాని మోదీ తెలిపారు.
గంగా తలాబ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత
మారిషస్‌లో ఉన్న గంగా తలాబ్ హిందువులకు పవిత్ర ప్రదేశంగా మారింది. ఇది భారతదేశంలోని గంగా నదికి ప్రతీకగా భావించబడుతుంది. భారత ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఈ ప్రదేశానికి మరింత ప్రాముఖ్యత లభించింది.మారిషస్‌లో అత్యంత పవిత్రమైన హిందూ తీర్థయాత్ర స్థలంగా పిలువబడే గంగా తలావ్ భారతదేశంలోని పవిత్ర గంగా నదికి ప్రతీక. అలాగే సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని భావిస్తున్నారు. 1972లో గంగా జలాన్ని దాని నీటిలో కలిపారు.
ఈ పర్యటనలో సామర్థ్య నిర్మాణం, వాణిజ్య సహకారం, సరిహద్దు భద్రత, ఆర్థిక నేరాల నిరోధం వంటి రంగాలలో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఇది భారతదేశం – మారిషస్ సంబంధాలను మరింత బలపరచనుంది.భారత ప్రధానమంత్రి పర్యటన మారిషస్-భారతదేశ సంబంధాలను మరింత దగ్గర చేస్తుంది. ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారానికి కొత్త దారులను తెరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.