PM Modi : రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ భారతదేశ రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు జోరుగా నడుస్తున్న వేళ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.మోదీ 2029 తర్వాత కూడా ప్రధానిగా కొనసాగుతారు. ఆయనకు వారసుడిని అన్వేషించాల్సిన అవసరం లేదు!” అని ఫడ్నవిస్ స్పష్టం చేశారు.శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. “సెప్టెంబర్‌లో మోదీ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనతో నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మోహన్ భగవత్‌ను కలిశారు” అని ఆయన తెలిపారు.మోదీ రిటైర్ అవుతారనే కథనాల్లో నిజం లేదు. మన సంస్కృతిలో తండ్రి బతికుండగా వారసత్వంపై చర్చించడం లేదు.అది మొఘల్ రాజుల సంస్కృతి!

అంతేకాదు, 2029 ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధానిగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు.ఇదే విషయంపై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత సురేష్ భయ్యాజీ జోషి స్పందించారు.మోదీ మోహన్ భగవత్ సమావేశం గురించి నాకు సమాచారం లేదు.ఈ ఊహాగానాలకు ఎలాంటి ఆధారం లేదు!అయితే, కోవిడ్ సమయంలో మోదీ చేసిన సేవలు అభినందనీయమని, హెడ్గేవార్ జయంతికి స్వయంసేవక్‌గా హాజరుకావడం ప్రశంసనీయం” అని ఆయన తెలిపారు.సంజయ్ రౌత్ చేసిన మరో ఆసక్తికర వ్యాఖ్య ఏమిటంటే –మోదీ తర్వాత ప్రధాని మహారాష్ట్ర నుంచే వస్తారు.మోదీ తర్వాత ఎవరనేది చర్చించాల్సిన సమయం ఇంకా రాలేదు.ఇప్పటికిప్పుడు ప్రధానిగా మోదీనే ఉంటారు! మోదీ రిటైర్మెంట్‌పై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతలూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఫడ్నవిస్ సైతం ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, 2029లోనూ మోదీనే ఉంటారని తెలిపారు. భారత రాజకీయాల్లో 2024 ఎన్నికలు కీలకం. ఈ ఎన్నికల తర్వాత భాజపా భవిష్యత్తు ఎలా మారుతుంది? మోదీ తర్వాత ఎవరు వచ్చే అవకాశం ఉంది? అన్న చర్చ కొనసాగుతూనే ఉంది.