PmInternship : పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ రిజిస్ట్రేషన్‌ తేదీ పొడిగింపు

PmInternship : పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ రిజిస్ట్రేషన్‌ తేదీ పొడిగింపు

యువతకు నైపుణ్యాలు నేర్పించి, ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం 300కు పైగా కంపెనీల్లో, లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందించనుంది. మొదటగా మార్చి 12 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిన గడువును, తాజాగా మార్చి 31 వరకు పొడిగిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఇది చివరి అవకాశం.ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో ప్రతి నెల రూ. 5,000 స్టైఫండ్,కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్‌టైం గ్రాంట్‌) కూడా చెల్లిస్తారు. అంటే మొత్తం మీద ఏడాదిలో రూ.11,000 పొందుతారు. ఏడాదిలో ఆరు నెలలు క్లాస్‌ రూంలో,మిగిలిన 6 నెలలు ఫీల్డ్‌లో శిక్షణ ఉంటుంది. శిక్షణలో ఆరు నెలలు క్లాస్‌రూమ్ ట్రైనింగ్, మిగిలిన ఆరు నెలలు ప్రాక్టికల్ ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. రాబోయే ఐదేళ్లలో టాప్ 500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు అందించడమే ఈ పథక లక్ష్యం.

అర్హులు

పదో తరగతి పాసైన అభ్యర్థులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగి ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు ఈ పథకానికి అర్హులు. ఆన్‌లైన్‌/దూరవిద్య ప్రోగ్రామ్‌లో చదువుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అనర్హులు

ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాలకు చెందినవారు, వార్షికాదాయం రూ. 8 లక్షలు దాటిన కుటుంబాలతో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు, సీఏ, సీఎంఏ అర్హత కలిగినవారు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా కేంద్రం పేర్కొంది.

రాబోయే ఐదేళ్లలో టాప్‌ 500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యే కంపెనీలు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ అందిస్తాయి. ఇంటర్న్‌షిప్‌లో చేరినవారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. పీఎం జీవన్‌ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా కల్పిస్తారు. దీనికి కావాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్ యువతకు నైపుణ్యాల పెంపు, ప్రాక్టికల్ అనుభవం, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రూపొందించబడింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి మరో ఐదేళ్లలో కోటి మందికి శిక్షణ అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయి.

Related Posts
Chhattisgarh high court: కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని బలవంతం చేయకూడదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు
కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని బలవంతం చేయకూడదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

ఒక మహిళను కన్యత్వ పరీక్ష చేయించుకోమని బలవంతం చేయకూడదు ఎందుకంటే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ను ఉల్లంఘిస్తుంది, ఇది గౌరవ హక్కుతో సహా జీవనం, స్వేచ్ఛను Read more

ఆప్ ఓటమి పై స్వాతి మాలీవాల్ ట్వీట్
Swati Maliwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా కేవలం 'ద్రౌపది Read more

NIACL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024: 500 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
NIACL అసిస్టెంట్ 2024

న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) 500 అసిస్టెంట్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ అవకాశానికి ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు Read more

మోదీకి కేజ్రీవాల్ లేఖ!
మోదీకి కేజ్రీవాల్ లేఖ!

జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ మోదీకి లేఖ రాసిన అరవింద్ కేజ్రీవాల్. గత దశాబ్దంలో ఢిల్లీలోని జాట్ కమ్యూనిటీకి కేంద్రం ద్రోహం చేసిందని ఆరోపించిన అరవింద్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *