హైదరాబాద్: గజ్వేల్‌లో పోటాపోటీ బహిరంగసభలకు రేవంత్, కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో భారీ బహిరంగసభ పెట్టుకుందాం అని కేసీఆర్ ఇటీవల తన ను కలిసిన పార్టీ నేతలకు చెప్పారు. ఆ బహిరంగసభ గజ్వేల్‌లోనే అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా తేదీ ఖరారు చేయలేదు. కాంగ్రెస్ కూడా గజ్వేల్ లోనే బహిరంగసభకు ప్లాన్ చేస్తోంది. కులగణనను సక్సెస్ చేసినందుకు ఈ సభను నిర్వహించాలని అనుకుంటున్నారు. దీంతో గజ్వేల్ వేదికగా రెండు పార్టీలు రాజకీయంగా యుద్ధానికి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

రేవంత్ రెడ్డి సీఎంగా యాక్టివ్ గా ఉండగా.. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఫామ్ హౌస్ కే పరిమితయ్యారు. ఇప్పటికి పదిహేను నెలలే రేయింది రేవంత్ అధికారంలోకి వచ్చి. అందుకే కొంత సమయం ఇద్దామని కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు.. ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా రావడంతో ఇక రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు. అంటే ఇరువురు ఇక తమ దంగల్ ను గజ్వేల్ నుంచి ప్రారంభిస్తారు. ఇక తెలంగాణ రాజకీయం ఈ స్థానిక ఎన్నికల నుంచే వేడి మీద సాగనుంది.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూండటంతో పార్టీని యాక్టివ్ చేయడానికి కేసీఆర్ బహిరంగసభకు ప్లాన్ చేశారు. ఇటీవల తనను కలిసిన క్యాడర్ కు అదే చెప్పారు. కేటీఆర్, కవిత, హరీష్‌రావు ప్రజల్లో ఉన్నా కేసీఆర్ తెరపైకి వస్తే వచ్చే ఊపు వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 5 లక్షల మందితో బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. కేసీఆర్-హరీష్‌రావు నియోజకవర్గాలు పక్కపక్కనే ఉండడంతో జనాన్ని భారీగా సమీకరించవచ్చని భావిస్తోంది. ఈ సభ సక్సెస్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నది కారు పార్టీ కీలక నేతల అంచనా.