ఇప్పటి వేగవంతమైన జీవన శైలిలో ఒత్తిడి (Stress) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఉద్యోగం, చదువులు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాలు వంటి అనేక కారణాల వలన మనసు, శరీరం ఒత్తిడికి గురవుతాయి. ఈ ఒత్తిడి క్రమంగా పెరుగుతూ ఉంటే అది ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, నిద్రలేమి, మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. ఇప్పుడు దాన్ని తగ్గించే కొన్ని ఉత్తమ చిట్కాలను చూద్దాం.
వంట చేయడం
ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే వంట చేయడం ఉత్తం. ఏం చేయాలో తెలియక, ఒంటరిగా ఒత్తిడితో బాధపడుతున్నావు, వంట రూమ్ (Kitchen room) లోకి వెళ్లి ఇష్టంగా తమకు నచ్చిన వంటలు చేసుకొని తినడం వలన కాస్త ఒత్తిడి నుంచి బయటపడతారు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఒత్తిడి లేని జాబ్ చేయడం
ప్రస్తుతం చాలా మంది యూత్ ఒత్తిడి సమస్యను అధికంగా ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు ఉద్యోగంలో మార్పులు చేసుకోవడం ఉత్తమం.
ఎక్కువగా పుస్తకాలు చదవడం చేయడం
ఒత్తిడితో బాధపడే వారు ఎక్కువగా పుస్తకాలు చదవడం చేయడం చాలా మంచిది. ఇది చాలా వరకు మీలోని ఒత్తడిని తగ్గిస్తుంది. అలాగే సంగీతం వినడం వలన కూడా ఒత్తిడి తగ్గిపోయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
ఇష్టమైన స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడటం
మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మీకు చాలా ఇష్టమైన స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడటం లేదా ఛాటింగ్ చేయడం వలన ఒత్తిడి దగ్గిపోతుంది.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం, ధ్యానం చేయడం
అధిక ఒత్తిడి మీ పై చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం, ధ్యానం చేయడం లాంటివి చేయాలి. దీని వలన ఒత్తిడి నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.