📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Railway Stations: దేశంలో అత్యంత అందంగా కనిపించే టాప్ 5 రైల్వే స్టేషన్లు ఇవే!

Author Icon By Anusha
Updated: July 6, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైల్వే ప్రయాణం అంటే ఎంతో మందికి చిన్నప్పటి జ్ఞాపకాలతో నిండిన ఒక మధురమైన అనుభవం. ముఖ్యంగా సుదూర ప్రయాణాల కోసం సామాన్యులు రైలును ఎక్కువగా ఉపయోగిస్తారు. రైలు కిటికీలోంచి కనపడే ప్రకృతి అందాలను చూసే మజా ఏ ప్రయాణానికీ ఉండదు. మన దేశంలో కొన్ని రైల్వే స్టేషన్లు (Railway Stations) మాత్రం రైలు ప్రయాణం కంటే ముందే మన మనసును ఆకర్షిస్తాయి. నిర్మాణ శైలి, చుట్టూ ఉన్న ప్రకృతి, పర్యావరణ శుభ్రత, ఈవెంట్ లైటింగ్‌లు ఇలా ఎన్నో అంశాల్లో ఆ స్టేషన్లు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి టాప్ 5 రైల్వే స్టేషన్లు ఇవే:

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్

దక్షిణ భారతంలో ప్రధాన రైల్వే స్టేషన్ చెన్నై సెంట్రల్ (Railway Station Chennai Central). చారిత్రక ప్రాముఖ్యతతో పాటు అద్భుతమైన నిర్మాణ శైలి దీని సొంతం. దీన్ని గోతిక్, రోమనెస్క్ శైలులలో నిర్మించారు. ఇది చూడ్డానికి చాల బాగుంటుంది. 

ఘూమ్ రైల్వే స్టేషన్, డార్జిలింగ్

దేశంలోని తూర్పు భాగంలో ఉన్న డార్జిలింగ్‌ (Darjeeling) హిమాలయన్ రైల్వే్స్, బొమ్మ రైళ్లను నడుపుతోంది. ఘుమ్ రైల్వే స్టేషన్‌ అందాన్ని చూసి మీరు మీ కళ్ళను నమ్మలేరు. ఘుమ్ భారతదేశంలోనే ఎత్తైన రైల్వే స్టేషన్.

చార్‌బాగ్ రైల్వే స్టేషన్, లక్నో

లక్నో నగరం రుచి, సంస్కృతి, నబావి శైలికి ప్రసిద్ధి. ఇక్కడి చార్‌బాగ్ రైల్వే స్టేషన్ చూడటానికి చాలా పెద్దది. దీన్ని ఇండో-సార్సెనిక్ ఆర్కిటెక్చర్‌ (Architecture) లో నిర్మించారు. ఇది చాలా అద్భుతమైన నిర్మాణంలా కనిపిస్తుంది.

మధురై రైల్వే స్టేషన్

మధురై రైల్వే స్టేషన్ టెంపుల్ టౌన్ తరహాలో నిర్మించారు. దీని రూపకల్పన ప్రసిద్ధ మీనాక్షి ఆలయం నుండి ప్రేరణ. మాల్, ఎయిర్ కాన్కోర్స్ (Air concourse) వంటి అనేక సౌకర్యాలు దీనిని విలాసవంతమైన రైల్వే స్టేషన్‌గా చేస్తాయి.

ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై

అత్యంత రద్దీ గల ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ దేశంలోని అత్యంత అందమైన రైల్వే స్టేషన్. గోతిక్ శైలి (Gothic style) కలిగిన నిర్మాణంలో క్లిష్టమైన శిల్పాలు కళ్లను కట్టిపడేస్తాయి. ఈ రైల్వే స్టేషన్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Akshardham Temple: అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన ఆస్ట్రేలియా ఎంపీలు.. భారత సంస్కృతిపై ప్రశంసలు

#BeautifulRailwayStations #BudgetTravel #EcoFriendlyTravel #HiddenGemsIndia #IncredibleIndia #IndianRailways #IndianStations #NatureAndTravel #RailwayHeritage #RailwayTourism #RailwayVibes #ScenicTrainRoutes #TrainJourneys #TrainWindowViews #travelindia Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.