📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Monal: బిగ్‏బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా!

Author Icon By Anusha
Updated: July 3, 2025 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బుల్లితెరపై ఎన్నో షోలు వస్తుంటాయి.పోతుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, టీవీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తాయి. అటువంటి షోలలో ఒకటి బిగ్ బాస్ తెలుగు. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి (Audience focus) మొత్తం సీజన్ 9పై నిలిచింది.బిగ్ బాస్ అంటేనే ఒక రియాల్టీ డ్రామా, ఎమోషన్స్, కాంట్రవర్సీలు, ఫ్రెండ్‌షిప్స్, ఎలిమినేషన్స్, డిసిప్లిన్ అనే అంశాల సమ్మేళనం. 2017లో మొదలైన ఈ ప్రయాణం ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రతి సీజన్‌కు ప్రత్యేకత, గొప్ప హైప్, అలాగే కొత్త కంటెస్టెంట్లతో కొత్తగా అనిపించే పంథా ఉండేది. ఈసారి సీజన్ 9పై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

ప్రయాణం

తెలుగు బిగ్ బాస్‌లో మోనాల్ గజ్జర్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 4లో ఆమె పాల్గొన్నారు. మొదట్లో ఎంతో మంది ఆమెపై విమర్శలు చేసినా, కొద్దికాలానికే ప్రేక్షకుల మద్దతు అందుకుంటూ టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు.మోనాల్ ఎమోషనల్ వైపు, డ్యాన్స్ స్కిల్స్, గ్లామరస్ ప్రెజెన్స్ (Glamorous presence) అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అఖిల్ సార్థక్‌తో ఆమె స్నేహం, అందులోని భావోద్వేగాలు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీశాయి.

వెన్నెల

మోనాల్ గజ్జర్ సినీరంగంలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ. ఒకప్పుడు ఈ అమ్మడు చాలా పాపులర్. 2012లో వచ్చిన సుడిగాడు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వెన్నెల 1 1/2, ఒక కాలేజ్ స్టోరీ, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి వంటి సినిమాల్లో నటించింది.అయితే వరుస సినిమా (Movies) ల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా బ్రేక్ రాలేదు. కానీ బిగ్‏బాస్ పుణ్యమా అని ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

నెటిజన్స్

ఈ ముద్దుగుమ్మ బిగ్‏బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఇందులో అందంతోపాటు తన ఆటతీరు, మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న మోనాల్.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. సిల్వర్ కలర్ చుడిదార్ (Silver color chudidar) సెట్ లో మరింత అందంగా కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఈ అమ్మడు ఫోటోస్ షేర్ చేయడంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

Monal: బిగ్‏బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా!

మైలురాయిగా

అంతేకాకుండా, షో ముగిసిన తర్వాత మోనాల్‌కు సినిమాల్లో అవకాశాలు రావడం, ఆమె కెరీర్‌లో బిగ్ బాస్ మైలురాయిగా మారింది.బిగ్ బాస్ షోలో పాల్గొనడం అనేది కేవలం హడావుడి కోసం కాదని కెరీర్‌లో చాలా పెద్ద పుష్ (big push) ఇచ్చే అవకాశమని మోనాల్ ఉదాహరణ. అలాగే అరియానా గ్లోరి, శ్రీరామ చంద్ర, రవికృష్ణ, ప్రియ, అమిత్ తదితరులు కూడా ఈ షో ద్వారా మరింత ప్రజాదరణ పొందారు.

ప్రేక్షకులకు

ఈ షో ఒక వ్యక్తి అసలైన నైజాన్ని బయటపెడుతుంది. వారిలోని బలహీనతలు, స్థైర్యం, ఆత్మవిశ్వాసం అన్నీ ప్రేక్షకులకు (audience) కనిపిస్తాయి. ఈ కోణంలో చూస్తే, ఇది కేవలం రియాల్టీ షో కాదు నిజ జీవిత పాఠాలను చెప్పే వేదిక.

Read Hindi news: hindi.vaartha.com/

Read Also: Laptop Effects: ల్యాప్‌టాప్ ఇలా వాడడం వల్ల ఎన్ని నష్టాల్లో తెలుసా?

#monal gajjar Ap News in Telugu Bigg Boss contestant updates Bigg Boss craze Bigg Boss Monal contestant Bigg Boss popularity Bigg Boss Season 9 news Bigg Boss Telugu buzz Bigg Boss Telugu latest Bigg Boss Telugu Season 9 Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Monal Bigg Boss history Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.