📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Best Sun Rise Places: ఈ ప్రదేశాల్లో సూర్యోదయం అద్భుతం.. ఒక్కసారైనా చూడాల్సిందే!

Author Icon By Anusha
Updated: June 29, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రకృతి అందాల మధ్య నిశ్శబ్దంగా, ప్రశాంతంగా సేదతీరాలని ఎవరికైనా ఉంటుంది. రోజు రోజుకీ పెరిగిపోతున్న బిజీ లైఫ్‌లో ఓ విరామం తీసుకొని, కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి ప్రకృతి ఒడిలో గడిపే అనుభూతి వర్ణించలేనిది. ముఖ్యంగా ఉదయం లేవగానే ఆకాశంలో నెమ్మదిగా మెరుస్తూ పైకి వచ్చే సూర్యుడు దృశ్యం చూస్తే మనసు మైమరచిపోతుంది. అయితే ఈ అద్భుత దృశ్యాన్ని ఎక్కడినుంచి చూడాలి? ఏ ప్రదేశాలు దీనికి పర్ఫెక్ట్ (Perfect) అంటే చాలామందికి స్పష్టత ఉండదు.అందుకే ఇక్కడ సూర్యోదయాన్ని చూస్తే ఆ అనుభూతి జీవితాంతం గుర్తుండిపోయే కొన్ని అద్భుత ప్రదేశాలు మీ కోసం.

టైగర్ హిల్, పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ లో ఉన్న కాంచన్ జంగా పర్వతాల వద్ద ఉన్న టైగర్ హిల్ పర్యాటకులకు సూర్యోదయ వీక్షణ అనుభూతినిస్తుంది.డార్జిలింగ్ అంటే చలికాలపు కాఫీతో పర్వతాల్లో మాయాజాలం అనిపించేదే. కానీ టైగర్ హిల్ అంటే మాత్రం “Sunrise Point” అనిపించక తప్పదు. ఇక్కడ నుండి కాంచన్ జంగా పర్వత శ్రేణి మీద పడే మొదటి సూర్యకిరణం చూస్తే గూస్బంప్స్ వస్తాయి.బంగారుపచ్చ రంగులో మెరుస్తూ కొండల్ని కవర్ చేసే ఆ సూర్యకాంతి – నిమిషాల్లోనూ రంగులు మార్చే మాయగాడు. ఇది ఒకసారి ఖచ్చితంగా చూడాల్సిన అద్భుత దృశ్యం.

కన్యాకుమారి – తమిళనాడు

ఇది ఒక వైవిధ్య భరితమైన ప్రదేశం. ఎందుకంటే మూడు సముద్రాలు కలిసే అరుదైన చోటు కన్యాకుమారి మాత్రమే. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, బెంగాళ్ ఖాతి కలిసే ఈ ప్రదేశం నుంచి చూస్తే సూర్యోదయం, సూర్యాస్తమయం (Sunset) రెండూ చూడవచ్చు.ప్రపంచంలో ఇలాంటి అదృష్టం చాలా తక్కువ ప్రదేశాల్లోనే ఉంటుంది. శిలామండపం దగ్గరనుండి సూర్యుడి అస్తమానాన్ని, అలాగే ఉదయాన్నే మొదటి కిరణాలను చూస్తే ఒక్క క్షణం మీరు మైమరచిపోతారు. ఇక్కడ సూర్యోదయాన్ని వీక్షిస్తే మధురానుభూతి కలుగుతుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు.

Best Sun Rise Places

నంది హిల్స్ – కర్ణాటక

బెంగళూరుకు సమీపంలో ఉన్న ఈ నంది కొండలు, ఓ “Sunrise Lovers Paradise” అనే చెప్పొచ్చు. ఉదయాన్నే 5 గంటల లోపే అక్కడికి చేరుకుంటే, మీరు మేఘాల మధ్య నుంచి పైకి తలెత్తుతున్న సూర్యుడిని మబ్బుల తొడుగులోంచి దీవించే కాంతిలా చూడవచ్చు.అక్కడ వాతావరణం చాలా ప్రశాంతం. ఫోటోగ్రఫీకి మంచి ప్రదేశం.చలికాలంలో వెళితే మంచుతో పాటు వెలుగు కిరణాలు కలిసి మీ కళ్ళు తిప్పుకోలేరు.ఈ ప్రాంతంలో మొదటి సూర్యోదయాన్ని చూస్తే ఆ ఫీలింగ్ మాటాల్లో చెప్పలేమని పర్యాటకుల అభిప్రాయం. ఇక్కడికి లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లి సూర్యోదయం చూడాలి.

ఉమియం సరస్సు – షిల్లాంగ్, మేఘాలయ

ఈ ప్రదేశాన్ని చూసిన తర్వాత మీరు ఇలాగే అనుకుంటారు – “ఇది స్వర్గం అని “షిల్లాంగ్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమియం సరస్సు దగ్గర కొండల మధ్య నుంచి పైకి వస్తున్న సూర్యుడి (SUN)ని చూడడం ఒక స్వప్నమే. నీటిపై ప్రతిబింబంగా పడ్డ సూర్యకాంతి మైమరపించేలా ఉంటుంది.ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడికి మీరు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ హౌస్‌బోట్స్, క్యాంపింగ్ టెంట్స్, సైక్లింగ్ వంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఉదయం అక్కడ కాలివీధుల్లో నడవడం స్వర్గమే స్వర్గం.

కోవలం బీచ్ – కేరళ

కేరళ అంటే ప్రకృతి ప్రేయసి. ఇక కోవలం బీచ్ అంటే స్వచ్ఛమైన సముద్ర తీరంలో ఉదయాన్నే మత్తెక్కించే సూర్యోదయం.ఇక్కడి లైట్ హౌస్ దగ్గర ఉండి చూస్తే, ఒక ఫ్రేమ్‌లో పడే ఎరుపు రంగు సూర్యుడు, నీలి సముద్రం మధ్య చిలికుతున్న కిరణాలు ఫోటోల్లో కాదు, మనసుల్లో నిలిచిపోయే చిత్రాలు.ఇది హనీమూన్, ఫ్యామిలీ ట్రిప్, స్నేహితులతో వెకేషన్ (Vacation) కు బెస్ట్ ప్లేస్. రిసార్ట్‌ల నుంచి డైరెక్ట్ బీచ్‌కి వాకింగ్‌ డిస్టెన్స్‌లో ఉండడం అదనపు ఆకర్షణ.మనలో చాలా మంది విహారయాత్రలకు కేరళ వెళ్తుంటారు. అలాంటి వారు వీలు కుదిరతే కోవలం బీచ్ ను సందర్శిస్తే ఉదయం అక్కడ సూర్యోదయ వీక్షణాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

ముంబై పాయింట్ – మహాబలేశ్వర్, మహారాష్ట్ర

ఇది సూర్యోదయం కాదు , సూర్యాస్తమయం కోసం ప్రసిద్ధి చెందిన ప్రదేశం. కానీ ఎప్పటికీ గుర్తుండిపోయే సూర్యుడి అస్తమయ దృశ్యాన్ని చూసే బెస్ట్ వేదిక.మహాబలేశ్వర్ పాత బొంబై రోడ్ పై ఉన్న ఈ ప్రదేశం నుంచి చూస్తే, సూర్యుడు నెమ్మదిగా పర్వతాల వెనకాల మాయమవుతూ ఆకాశాన్ని బంగారు రంగులో ముంచేస్తాడు.ఇది ప్రేమజంటలు, నిశ్శబ్దంగా ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి బెస్ట్ స్పాట్ (Best Spot) .ప్రతి చోట సూర్యోదయాన్ని చూసి ఆనందిస్తే ఈ ప్రదేశంలో మాత్రం సూర్యాస్తమయాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ప్రజలు వివిధ కోణాల సూర్యాస్తమయం వీక్షించడానికి వస్తూ ఉంటారు.

Read Also: IRCTC: ట్రెయిన్ వెయిటింగ్ టిక్కెట్లపై ప్రయాణికుల ఆగ్రహం.. రైల్వే శాఖపై విమర్శలు

#BestSunriseSpots #MagicalSunrise #MorningVibes #SunriseViews Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.