నేపాల్‌లో హింసాత్మకంగా మారిన 'పీపుల్స్ మూవ్‌మెంట్ '

Nepal: నేపాల్‌లో హింసాత్మకంగా మారిన ‘పీపుల్స్ మూవ్‌మెంట్ ‘

నేపాల్‌లో రాచరికం మద్దతుదారుల ‘పీపుల్స్ మూవ్‌మెంట్ ‘ మొదటి రోజే హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో రాచరిక అనుకూల శక్తులు తమ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తాయనే ఆందోళన మరింతగా వ్యక్తమవుతోంది. రాచరిక ఉద్యమ నేతగా దుర్గా ప్రసాయిని ప్రకటించారు. దుర్గా ప్రసాయి పోలీసుల ‘వాంటెడ్’ జాబితాలో ఉన్నారని భద్రతా అధికారులు చెప్పారు. ఉద్యమ కన్వీనర్ నవరాజ్ సుబేదీని గృహ నిర్బంధంలో ఉంచారు.
రాచరికం స్థాపించాలననే డిమాండ్
రాచరిక అనుకూల రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆర్పీపీ)కి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులను శుక్రవారం(మార్చి 28) అరెస్టు చేశారు. దేశంలో రాచరికం స్థాపించాలని ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. నారాయణహితి ప్యాలెస్‌కు మాజీ రాజు జ్ఞానేంద్ర షా తిరిగి రావాలని రాచరిక మద్దతుదారులు ప్రారంభించిన ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. నారాయణహితి అనేది కఠ్మాండూలో ఉన్న రాజభవనం. ఒకప్పుడు రాజు ఇక్కడ నివసించారు. రాచరిక వ్యవస్థ అంతమై ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత దానిని మ్యూజియంగా మార్చారు. నేపాల్‌లో రెండు దశాబ్దాల కిందట గణతంత్ర రాజ్యాన్ని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమం జరిగింది. ఇది రాజ్యాంగ సభ ఏర్పాటుకు దారితీసింది. 2008లో రాచరికం అంతమై గణతంత్ర రాజ్యం ఏర్పడింది. నిరసనలు కొనసాగుతాయని, అయితే ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తారనేదానిపై స్పష్టత లేదని రాచరిక అనుకూల నాయకులు చెప్పారు.

నేపాల్‌లో హింసాత్మకంగా మారిన 'పీపుల్స్ మూవ్‌మెంట్ '

రాచరికం పునరుద్ధరణ కోసం అనేక గ్రూపుల ఉద్యమం
నేపాల్‌లో హిందూ దేశం, రాచరికం పునరుద్ధరణ కోసం అనేక గ్రూపులు ఉద్యమిస్తున్నాయి. అయితే వాటిలో ఏకాభిప్రాయం లేకపోవడంతో ఒకే నాయకత్వం ఏర్పడే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. శుక్రవారం నిరసన పేరుతో జరిగిన హింసాత్మక కార్యకలాపాలకు బాధ్యత వహించడానికి నాయకులు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ నిరసనలు నాయకుల నియంత్రణలో లేవని వారు బహిరంగంగానే అంటున్నారు. ఉద్యమానికి సంప్రదాయ రాచరిక అనుకూల వాదులు నాయకత్వం వహిస్తారా లేదా ఆర్‌పీపీ నాయకత్వంలో నిరసనలు జరుగుతాయా అన్నది తెలియాల్సిఉంది. శుక్రవారం(మార్చి 28) నాటి నిరసనకు ఎవరు బాధ్యత తీసుకుంటారో తేలాల్సి ఉంది.

నేపాల్‌లో హింసాత్మకంగా మారిన 'పీపుల్స్ మూవ్‌మెంట్ '

‘హింసకు మద్దతు లేదు’
నేపాల్ రాజధాని కఠ్మాండూలో ఏప్రిల్ 8న ఒక సమావేశం, ఏప్రిల్ 20న రాజధానిలో ఒక ఆందోళన, బాగ్‌మతి (నేపాల్‌లోని ఏడు ప్రావిన్సులలో ఒకటి)లో ఒక ప్రావిన్సు స్థాయి నిరసనను నిర్వహిస్తామని ఆర్‌పీపీ ప్రకటించింది. సీనియర్ నాయకుల అరెస్టు, ఉద్యమంపై సమీక్షించడానికి శనివారం(మార్చి 30) ఆర్పీపీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. సమావేశం తర్వాత, ఆర్‌పీపీ అధ్యక్షులు రాజేంద్ర లింగ్దెన్ బీబీసీతో మాట్లాడారు. “రాచరికం పునరుద్ధరణ కోసం ఎవరైనా చేసే శాంతియుత ఉద్యమానికి మద్దతు ఇస్తామని ఆర్‌పీపీ ఇప్పటికే ప్రకటించింది. కానీ హింసకు మద్దతివ్వదు” అని లింగ్దెన్ చెప్పారు. కఠ్మాండూలోని టింకునేలో హింస జరిగేలా ప్రభుత్వమే రెచ్చగొట్టిందని, దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్టయిన సీనియర్ నాయకులు హింసాత్మక కార్యకలాపాలలో పాల్గొనలేదని లింగ్దెన్ పేర్కొన్నారు. “హింసాత్మక కార్యకలాపాలలో పాల్గొన్న ఎవరినైనా విచారించాలి” అని ఆయన అన్నారు. నిరసనల సమయంలో అరెస్టు చేసిన అమాయక పౌరులను విడుదల చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.

నేపాల్‌లో హింసాత్మకంగా మారిన 'పీపుల్స్ మూవ్‌మెంట్ '

పార్టీలో వర్గ విభేదాలు
రాచరికం,హిందూ దేశం డిమాండ్లతో కొత్త ఉద్యమం రూపురేఖలు సిద్ధమవుతుండగా, ఆర్‌పీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇది అందరికీ అర్ధమయింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించని సుబేదీ ని మాజీ రాజు జ్ఞానేంద్ర షా కోరిక మేరకు, రాచరిక ఉద్యమ నాయకుడిగా నియమించారు. ఆర్‌పీపీ సీనియర్ ఉపాధ్యక్షుడు రవీంద్ర మిశ్రా, ప్రధాన కార్యదర్శి ధవల్ షంషేర్ రాణా, నాయకుడు హరి బహదూర్ బాస్నెత్‌లు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నాయకుడిగా తనను మొదట ప్రతిపాదించారని ఇమేజ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబేదీ చెప్పారు.
జ్ఞానేంద్ర షా ఆదేశంతో ఉద్యమం
మాజీ రాజు జ్ఞానేంద్ర షా కోరిక మేరకు సుబేదీని ఉద్యమ నాయకుడిగా నియమించారని చెబుతారు. రాచరిక మద్దతుదారులందరికీ ఆమోదయోగ్యమైన నాయకత్వం ఉండాలనే ఉద్దేశంతో 86 ఏళ్ల సుబేదిని నాయకుడిగా ఎన్నుకున్నారని చాలామంది భావిస్తున్నారు. శుక్రవారం నిరసనకు ముందు, సుబేదీ, దుర్గా ప్రసాయి… నిర్మల్ నివాస్ (మాజీ రాజు జ్ఞానేంద్ర షా ప్రైవేట్ నివాసం) చేరుకుని షాను విడివిడిగా కలిశారు. ఆ సమావేశాల తర్వాత కూడా జ్ఞానేంద్ర షాకు సుబేదీ, ప్రసాయి ఇష్టమైన నాయకులు అయి ఉండవచ్చన్న ప్రచారం సాగింది. గురువారం నిర్మల్ నివాస్‌లో సుదీర్ఘ చర్చలు జరిపి తిరిగి వచ్చిన తర్వాతే ప్రసాయిని ఉద్యమ నాయకుడిగా నియమించారు.

Related Posts
షహీన్ అనుచిత ప్రవర్తన పై పాక్ విమర్శ..
షహీన్ అనుచిత ప్రవర్తన పై పాక్ విమర్శ..

ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్‌కేతో జరిగిన గొడవపై పాక్ స్పీడ్‌స్టర్ షహీన్ అఫ్రిది ఎట్టకేలకు నోరు విప్పాడు.పాకిస్తాన్-సౌతాఫ్రికా Read more

పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి
pitapuram hsp

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురానికి మెరుగైన వైద్య సేవలను అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న 30 పడకల కమ్యూనిటీ Read more

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్
Kelh Bachupally Campus Promotes Unity Through Community Service

హైదరాబాద్‌: కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్‌లోని నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్ ) యూనిట్ బౌరంపేట మరియు బాచుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్ పి హెచ్ Read more

యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితులు
crime

రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. స్నేహితుల మధ్య చోటుచేసుకున్న చిన్న గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన డిసెంబర్ 12న రాత్రి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *