Pensions : ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. ఇక, బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజక వర్గంలోని కొత్త గొల్లపాలెం, పెద్ద గంజాంలో పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. పెన్షన్ల పంపిణీ అనంతరం స్థానికులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అలాగే, మధ్యాహ్నం పర్చూరు నియోజక వర్గంలోని టీడీపీ క్యాడర్ తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పించన్లు పంపిణీ
ఇక, ఈ రోజు సీఎం చంద్రబాబు ఉదయం 10.40 నిమిషాలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా కొత్త గొల్లపాలెంకి బయలు దేరుతారు. 11.10 నిమిషాలకు కొత్త గొల్లపాలెంకి చేరుకోనున్నారు. 11.45 నుంచి 12.25 మధ్య లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పించన్లు పంపిణీ చేయనున్నారు. 12.25 నిమిషాలకు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానికులతో ముఖాముఖి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్నారు. అలాగే, మధ్యాహ్నం 2.15 నుంచి 3.35 వరకు పర్చూరు నియోజక వర్గ టీడీపీ క్యాడర్ తో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఉండవల్లి నివాసానికి బయలుదేరి సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు.
కొత్తగా పంపిణీ చేసిన ఎల్-1 ఆర్‌డీ పరికరాలు
ఇక, కొత్తగా పంపిణీ చేసిన ఎల్-1 ఆర్‌డీ పరికరాలను యూఐడీఏఐ ఆధార్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించారు. దీనివల్ల వేలిముద్రలపై గీతలు ఉన్నా, చేతులు తడిగా ఉన్నా సరే, వేలిముద్రలను స్పష్టంగా స్కాన్ చేయవచ్చు. దీని ద్వారా అక్రమాలకు కూడా అడ్డుకట్ట వేయవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలతో పింఛన్లు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎల్-1 పరికరాలను కొనాలని సూచించింది.