డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు పెంగ్విన్ లు వలస

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు పెంగ్విన్ లు వలస

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు పెంగ్విన్ లు వలస వెళుతున్నాయట.. ఇంతే సి పన్నులు వేస్తే తమ వ్యాపారం ఏంకావాలని ఆందోళన చెందుతున్నాయని, తమ వ్యాపారాలను వేరే ఎక్కడికైనా తరలిస్తామని ట్రంప్ తో తెగేసి చెప్పాయట. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మీమ్ లలో ఇదొకటి. ట్రంప్ టారిఫ్ లపై మీమర్స్ ఇలా ఫన్నీ మీమ్ లతో వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల రష్యాతో యుద్ధం నిలువరించేలా చూడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కలిసిన విషయం తెలిసిందే.

Advertisements
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు పెంగ్విన్ లు వలస

పెంగ్విన్ తో ఓ మీమ్ క్రియేట్
అయితే, ఆ సమావేశం రసాభాసగా మారింది. తాము ఆయుధాలు, క్షిపణులు అందించి సహాయం చేసినా జెలెన్ స్కీ అమెరికన్లకు ఒక్కసారి కూడా ధన్యవాదాలు చెప్పలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విమర్శించారు. ఈ విషయాన్ని టారిఫ్ లకు అన్వయిస్తూ.. ట్రంప్, వాన్స్ లతో పాటు కుర్చీలో కూర్చున్న పెంగ్విన్ తో ఓ మీమ్ క్రియేట్ చేశారు. ట్రంప్ తో భేటీకి సదరు పెంగ్విన్ సూట్ వేసుకుని వెళ్లినా టారిఫ్ లు విధించారంటే బహుశా ఆ పెంగ్విన్ అమెరికన్లకు థ్యాంక్స్ చెప్పలేదేమోనంటూ సెటైర్ వేశారు.

ఇరవై ఏళ్లలో ఆ దీవికి ఎవరూ వెళ్లలేదు
ఆస్ట్రేలియా ఆధీనంలో ఉన్న మెక్ డొనాల్డ్స్ దీవిలో కేవలం పెంగ్విన్ లు మాత్రమే నివసిస్తున్నాయి. గత ఇరవై ఏళ్లలో ఆ దీవికి ఎవరూ వెళ్లలేదు. అలాంటి ప్రాంతానికి కూడా టారిఫ్ లు వర్తిస్తాయని ట్రంప్ చెప్పారట. ఆ దీవి ఆస్ట్రేలియాకు చెందినది కాబట్టి 10 శాతం పన్ను చెల్లించాల్సిందేనని ఆయన అన్నారు. దీంతో మీమర్లు సోషల్ మీడియాలో ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. పెంగ్విన్ లు అన్నీ ఐక్యంగా ట్రంప్ పై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు మీమ్ లు తయారుచేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.

Related Posts
Mehul Choksi: మెహుల్ చోక్సీ ఫ్లాట్ మెయింటెనెన్స్ రూ.63 లక్షల బాకీ
మెహుల్ చోక్సీ ఫ్లాట్ మెయింటెనెన్స్ రూ.63 లక్షల బాకీ

ఇండియా వదిలి పారిపోయిన భారతీయ వ్యాపారవేత్త, 65 ఏళ్ల వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని తాజాగా సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే అతని Read more

లోపభూయిష్ట ప్రజాస్వామ్యంలో దిగజారుతున్న భారత్ స్థానం
భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో..! లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాల జాబితాలో భారత్

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం నానాటికీ క్షీణిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ అయిన ది ఎకనమిస్ట్ కు చెందిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) ఈ విషయాన్ని స్పష్టం చేసింది. Read more

బడ్జెట్ కోట్ మెరిల్ లైఫ్ సైన్సెస్‌లో సంజీవ్ భట్…
Mr. Sanjiv Bhatt, Senior Vice President, Corporate Strategy at Budget Quote Merrill Life Sciences

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వైద్య పరికరాల రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది, రోగులకు మెరుగైన ఫలితాలు మరియు అవకాశాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆధునిక ఆరోగ్య సంరక్షణకు మూలస్తంభంగా Read more

sunita williams: భూమ్మీదకు రానున్న సునీత, విల్మోర్-సురక్షితంగా ఎలా ల్యాండ్ అవుతుంది?
భూమ్మీదకు రానున్న సునీత, విల్మోర్- ఓసారి చరిత్రలోకి తొంగిచూద్దాం

ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలుగా చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమిని చేరనున్నారు. అమెరికా కాలమానం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×